నాలుగేళ్ళ క్రిందట లండన్‌లో పట్టాభి బావగారి అబ్బాయి వినయ్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్లింటికి దగ్గర్లో ఉన్న University of Reading క్యాంపస్ చూడటానికి వెళ్ళాం. Reading University అన్న పేరే ‘Calm’ pose అన్న నిద్రమాత్ర లాగానే పేరుకు తగ్గట్లే ఉందే అనుకొన్నా. బొత్తిగా చదవని బడుద్దాయుల్ని ఇందులో చేర్చి కనీసం యూనివర్సిటీ పేరు నిలబెట్టడానికైనా Reading (studying) చెయ్యండి అని బుజ్జగించవచ్చేమో కదా!
యూనివర్సిటీ లైబ్రరీ చూసి బయటకు వస్తుంటే రిసెప్షన్ కౌంటర్లో Bibliotherapy అన్న Pamphlet నా కంట పడింది. పాతికేళ్ళ క్రితం గుడివాడలో పనిచేస్తుండగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిగారి రాగంతో రోగం (Music Therapy) కార్యక్రమాన్ని చూశాను. స్వామిజీ కాషాయం Head band తో మ్యూజిక్ సింధసైజర్ను ఎ.ఆర్.రెహ్మాన్ లెవల్లో వాయించుతూ రెండు గంటలు మమ్ముల్ని మైమరపించేశారు. మ్యూజిక్ థెరపీతో పాటు ఆరోమా థెరపీ గురించి కూడా విన్నా కానీ ఈ Biblio Therapy ఏమిటా అని అప్పటినుండీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నా.
వాస్తవానికి ఈ బిబ్లియోథెరపీ చాలా ప్రాచీనమైనదే. క్రీస్తుపూర్వం 300 నాటికే గ్రీకు దేశస్థులు లైబ్రరీ ప్రవేశద్వారం మీద “Healing for the Soul” అని వ్రాసుకున్నారట. గ్రీకు తత్త్వవేత్త సాహిత్యానికి రోగాల్ని మాపేశక్తి ఉందని, ఫిక్షన్ చదవడమంటే అనారోగ్యాన్ని పోగొట్టుకోవడమే అని నమ్మేవాడట. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత షేక్స్పియర్ కూడా …’’
అని పాఠకుల్ని తన పుస్తక ప్రపంచంలోకి సాదరంగా ఆహ్వానించాడు. కొన్నివేల సంవత్సరాల క్రితమే మానసిక వైద్యశాలల్లో మానసిక రోగుల వైద్యం కోసం వైద్యులకు, రోగులకు లైబ్రరీలు ఉండేవట. 13వ శతాబ్దంలో కైరో ఆసుపత్రిలో రోగుల చికిత్స కోసం కొరాన్ చదవమని ప్రిస్క్రైబ్ చేసేవారట. ఇలా మొదలైన బిబ్లియోథెరపీ మొదటి ప్రపంచయుద్ధకాలానికి బాగా విస్తరించి అన్ని మానసిక వైద్యశాలల్లో యుద్ధంలో గాయపడిన సైనికుల భావోద్వేగాల నియంత్రణకు తోడ్పడింది. ఆ తరువాత కాలంలో లైబ్రరీలతో పాటు జైళ్ళలో, మనస్తత్వ, సామాజిక రంగాల్లోనే కాక విద్యారంగంలోకి కూడా క్రమ క్రమంగా బిబ్లియో థెరపీ ప్రవేశించింది.
19వ శతాబ్ధంలో మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ రోగుల సైకోఎనాలసిస్ కొరకు సాహిత్యాన్ని ఉపయోగించేవాడట. కాని బిబ్లియోథెరపీ అన్నపదాన్ని మొదటిగా ప్రయోగించింది సామ్యూల్ క్రోతర్సే. 1920 నాటికి Reading Therapy ప్రజాదరణపొంది అమెరికా విశ్వవిద్యాలయాల్లో బిబ్లియోథెరపీ శిక్షణా తరగతులు ప్రవేశపెట్టబడే స్థాయికి చేరుకుంది. పనిలో పనిగా Association of Poetry Therapy కూడా ఏర్పడి కవిత్వ చికిత్స కూడా మొదలయింది. కవిత్వంతో చికిత్స అంటే ఎప్పుడో విన్న జోకొకటి గుర్తొచ్చింది. వెనకటికి డాక్టరొకాయన వైద్యం మానేసి కవిత్వం రాయడం మొదలెట్టాడట. ఈ విషయం తెలియని ఒక మిత్రుడు ఆయనను ‘డాక్టర్ గారూ ప్రాక్టీస్ ఎలా ఉంది?’’ అని అడిగితే ఆయన ‘‘ప్రాక్టీసు మానేసానండి ఇప్పుడు కవిత్వం వ్రాస్తున్నాను’’ అనగానే మిత్రుడు ఏదైతేనేలెండి జనాన్ని చంపడానికి అనేసి నాలొక్కొరుకున్నాడట. ఇలాగే ఇంకో పెద్దాయాన్ని మీకు అన్నింటికంటె భయోత్పాతాన్ని కలిగించే సంఘటన ఏమిటని అడిగితే ‘‘కవి సమ్మేళనం’’ అనేసాడట. ఇందులో ఎంత నిజముందో మన ఉగాది కవి సమ్మేళనానికి వెళ్ళిన వాళ్ళకు బాగానే తెలిసొచ్చుంటుంది.
ఈ బిబ్లియోథెరపీ గురించి మరింతగా ఆలోచించగా ఆలోచించగా మనం కూడా ఇందులో ఏమీ వెనకబడిలేము అని గుర్తుకొచ్చింది. ఆ మాట కొస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి (ఆన్ రికార్డ్) డిప్రెషన్ పేషెంట్ అర్జునుడైతే మొదటి సైకియాట్రిస్టు శ్రీకృష్ణుడు. బిబ్లియోథెరపీ మన భగవద్గీతతోనే మొదలయింది. ఇప్పటికీ గీతను మించిన బిబ్లియోథెరపీ ప్రపంచంలో ఎక్కడా లేదు.
అదే వరుసలో ప్రపంచంలో మొట్టమొదటి స్టెనో గ్రాఫర్ వినాయకుడైతే, ఫస్ట్ డిక్టేషన్ ఇచ్చిన వారు వ్యాసులే. మనకు తెలిసినంతలో కురుక్షేత్ర యుద్ధానికి లైవ్ కామెంట్రీ ఇచ్చిన సంజయునికి ముందు మనకు తెలిసి కామెంటేటర్స్ లేరు. వీటితోపాటు పెళ్ళిళ్ళు ఆలస్యమైన ఆడపిల్లలకు రుక్మిణీ కళ్యాణ పారాయణం, తప్పిపోయిన పిల్లలు దొరకడానికి సుందరకాండ పారాయణం, చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం గరుడ పురాణ పారాయణం మనకు తెలిసిన మన బిబ్లియోథెరపీలు. ఎండి బీటలువారిన చెఱువులో వేసిన పందిరి కింద జరిగే విరాట పారాయణాలు, కష్టనష్టాల పీడ నివారణకు నిష్ఠగా చదివించుకునే నలచరిత్ర కథలు మన సంప్రదాయం. సంతానంలేని వారికి బాలకాండ పారాయణం కూడా ఇదే కోవలోదే.
ప్రవాస భారతీయులందరూ చదవదగిన గొల్లపూడి మారుతీరావుగారి ‘సాయంకాలమైంది’ నవలలో ఆచార్లుగారు కష్టంలో ఉన్న వ్యక్తితో మంచి చెడుల మనకర్మకి పరిపాకాలే అంటూ ఇవాళ్టి నుండి ఓ మండలం పాటు నీ ముందు సుందరకాండ పారాయణ చేస్తాను, కాదు చెప్తాను. నీ మనస్సు తేలికవుతుంది. రుగ్మత బరువు దిగిపోతుందని చెప్పడంలో పుస్తకం కూర్చే సాంత్వన ఎంత విలువైందో తెలిసొస్తుంది.
బిబ్లియోథెరపీలో ఇటీవల జరిగిన పరిశోధనల వల్ల వృద్దుల మానసిక కృంగుబాటుకు పుస్తకభిషక్కులు బహుబాగా పనిచేస్తున్నాయని తెలిసింది. ఫిక్షన్ ఎక్కువగా చదివేవాళ్ళ మొదళ్ళు మరింత సానుభూతి స్వభావాన్ని అలవరుచుకుంటున్నాయనేది పరిశోధనల సారం.
ప్రస్తుతం అమెరికా, ఇంగ్లండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో బిబ్లియోథెరపీ కోర్సులు చేసినవారు బిబ్లియోథెరపిస్టులుగా ప్రాక్టీసు చేస్తూ రోగులకు చికిత్స చేసినందుకు ఫీజులు కూడా బాగానే వసూలు చేస్తుండటం చూస్తుంటే మనం కూడా ఇది ఆలోచించవలసిన విషయమే. ఈ థెరపిస్టులు మందులు బదులు రోగులకు ఒక కథనో, పుస్తకాన్నో చదవమని ప్రిస్కైబ్ చేస్తారు. Books don’t just tell us a story – they become us who do we want to be? అనేది వారి నమ్మకం. అలాగే ‘a word after a word after a word is power’ కనుక ఆ శక్తే రోగులకు ఔషధంలా పనిచేస్తుందట.
పుస్తకం చదవకపోయినా కేవలం తాకినా గుణం చూపిస్తుందనేందుకు నాకు కనపడిన దృష్టాంతాలు మీతో చెప్పాల్సినవే. మా బంధువుల అబ్బాయి ఒకడు నాలుగేళ్ళొచ్చినా మందమతిగా ఉండటంతో ఎవరి సలహాతోనో వాడికి పదిడబ్బాల సరస్వతీ లేహ్యం, ఆరుడబ్బాల జ్ఞాన చూర్ణం తినిపించారట. దీని వల్ల పెద్దగా గుణం కనిపించకపోగా పిల్లవాడు బాగా వొళ్ళు చేయడంతో వాడ్ని Kids Gym కు తోలాల్సి వచ్చింది. అలా వీడి ఆగడాలు ఎక్కువవుతున్న రోజుల్లో వాడొకరోజు వాళ్ళ బామ్మను సతాయిస్తుంటే గీతాపారాయణం చేసుకుంటున్న బామ్మగారు గీతతో వాడి తలమీద సుతిమెత్తగా మోదిందట. చిత్రంగా రెండోరోజు నుండే వాడి బుద్ధి వికసించి సూక్ష్మబుద్ధుడై నేటికి అమెరికాలో ఎం.ఎస్.చదువుతున్నాడని తెలిసింది. నిన్నిటి దాకా శిలనైనా నీ పదముసోకి గౌతమినైనా అన్నది నమ్మినట్లే నేను చెప్పేది కూడా నమ్మమని మనవి.
నా ఆప్తమిత్రుడొకతను ఎప్పుడైనా నిద్రపట్టకపోతే ఏదో పుస్తకం తీసి చదవడం ప్రారంభించి రెండు పేజీలుపూర్తి కాకముందే గాఢనిద్రలోకి జారుకుంటానని చెప్పాడు. ఇదీ బిబ్లియోథెరపీనే కాకపోతే నెగటివ్థెరపీ కిందకొస్తుంది. మా బాబాయిగారి అబ్బాయికి చిన్నప్పటినుండి పుస్తకాలంటే పడదు. ఒకరోజు సంచారగ్రంథాలయం వ్యాన్ బాబాయిగారి ఇంటి ముందు పెట్టారట. అలాపెట్టిన గంటలోపే మా వాడికి వొళ్ళంతా రాష్ లా వచ్చేసిందట. దానికి కారణం ఏమిటో తెలుసుకునేలోపు సాయంత్రం వ్యాన్ అలా వెళ్ళడమేమిటి వీడి రాష్ ఇలా పోయింది. (It’s gone ad లోలా) చిన్నప్పుడు వాడికి బడిలో పెద్దబాల శిక్ష నేర్పించారు. చదువునేర్పేపుస్తకానికి బాల ‘శిక్ష’ అని పేరు పెట్టడం వాడికి నచ్చక, పుస్తకం అంటే శిక్ష అని మావాడు కమిటైపోయాడు. అందుకే ఈ ఎలర్జీస్. ఇప్పటికైనా నమ్ముతారా పుస్తకాల గాలిసోకినా, తాకినా ప్రభావం ఉంటుందని.
బిబ్లియోథెరపీ ఇహంలోనే కాదు పరలోకంలోనూ మనకు మేలే చేస్తుంది. అందుకనే ప్రఖ్యాత ఆంగ్ల రచయిత్రి వర్జీనియా ఉల్ఫ్ How should one Read a Book పుస్తకం ముగింపు Judgment Day (అంతిమతీర్పు రోజున)
“I have some times dreamt, at least, that when the Day of Judgment dawns and the great conquerors and lawyers and statesmen come to receive their rewards – their crowns, their laurels, their names carved indelibly upon imperishable marble – the Almightily will turn to Peter and will say, not without certain envy when He sees us coming with our books under our arms, Look, these need no reward. We have nothing to give them here. They have loved reading. “
పుస్తకాలు చేపట్టిన వారికి అంతకంటే మనం మిన్నగా ఇవ్వగల బహుమానం ఏమీలేదని భగవంతుడే చేతులెత్తేసాడు. కనుక మీరుకూడా పుస్తకం చేతపడితే ఇహపరాలు సాధించినట్లే చివరగా కవిమిత్రులు. ఎన్.గోపి గారి వొయ్యి (పుస్తకం) కవితలోని అద్భుత వాక్యాలతో ముగిస్తా …
‘‘కలంలో
ఓపికను నూరిపోసే
అక్షర దివ్యౌషధం పుస్తకం
మిత్రమా!
కాస్తయినా సేవించి తరించు
జీవన వస్త్రానికి
పుస్తకం ఒక జరీ అంచు’’
(ఆప్తమిత్రుడు మంచిపోలీసు రవీంద్రనాథ్‌కు కృతజ్ఞతలతో …)
తమరి కవిత్వంతో మాకు ఎన్నెన్నో క్రొత్త విశయాలు అటు మహాభారతం, శ్రీమద్రామాయణం నుండే కాక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయితల యెక్క గ్రంధాల నుంచి జ్ఞానాన్ని బహు తేలికైన భాషతో హాస్యరసాన్ని జోడించి ఆనందాన్ని పంచినారు.
చాలా కృతజ్ఞతలు .
“పుస్తకంహస్తభూషణం “…..మాత్రమే కాదు ….మన జీవననేస్తాలు ….అని తెలియచేసిన మీకు thanks n congrats 👏
అవును, ఎంతో మంది వారి జీవితాల్ని పుస్తకాలు ప్రభావితం చేసినట్లు, ఫలానా రచయిత ప్రభావితం చేసినట్లు చెప్పుకున్నారు. ఇప్పుడు చదవటం కాస్త తగ్గింది. ఒకప్పుడు చలం లాటి రచయితలు సమాజం మొత్తాన్ని ఒక కుదుపు కుదుపేశారు. భగవద్గీత నేటికీ ఓ యాంటీ బయోటిక్ గా ఉంది.
Harshavardhan garu
Thank you for sending me this wonderful article pusthaka bishakkulu. I am happy to learn the new concept ” Bibliotherapy”. The whole narration is apt , suggestive and lucid. I am sharing this article with my friends and relatives so that few of them undergo Bibilotherapy.
Keep going. Looking forward to more such posts.
Sravan Kumar
హర్షవనములో మరో శాఖోపశాఖలుగా విస్తరించి పు ప్ష్ప ఫల ములతో ఉన్న నిండైన వృక్షము వెలసినది . ఆనందముగా ఉన్నది. గీతా భో దనకు క్రొత్త భాష్యము. డాక్టరుగారి సేవా తిరఫీ బా గా హస్యపూరితము.
అయ్యా! మీరే టాపిక్ తీసుకున్నా మీ మార్క్ చూపిస్తున్నారు అభినందనలు—-చలం
Sir, Adbhutamga chepperandi. Really, chaalaaa Baagundi. 👏👏🙏
అయిదు ఏళ్లుగా అదే పనిలో మునిగి తెలియాడుతున్నాం.మీ వ్యాసాన్ని మరో పదిమందికి పంపుతున్నాను. మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు సారు.
భగవద్గీగత వివిద ఉపయోగాలనుంచి, ప్రపంచ సాహిత్య థెరపీని అద్భుతంగా చుట్టబెట్టారు. మీ ప్రతిభకూ, ఊహా శక్తికీ, పరిజ్ఞానానికీ జోహార్లు.
Nice 😊 Annaya
There is a strong base in every good habit..reading books always takes one to a different world…ఇందులో మానసిక ఆరోగ్యం eche paramartham kuda vundhi ane విషయం teliparu..oka new concept linking to our old tradition..Good one Sir..🙏🙏
👏👏👏👍👍👍
Excellent Suggestion. One can solve problems Creatively. Put excitement into Life.
హర్ష గారి పుస్తకభిషక్కులు చదివి ఒక కొత్త పదం తెలుసుకొన్నాను. హర్షవనం లో కొత్త కొత్త విషయాలను పరిచయం చేయడం చాలా బాగుంది.
Sir,
Engrossing subject.Studying books is really a therapy. My perspective on reading books has widened.
Beautiful writeup.
వ్యాస గణపతుల దగ్గరనుండి సచ్ఛిదానందవరకు లఘు వ్యాసం నడిపించడం మీ చాకచక్యానికి అభినందనలు. థెరఫీలలో బిబ్లియోగ్రఫి మంచి ప్రయోజనం కలిగిస్తుందని తెలిసింది. అభినందనలు హర్షవర్ధన్ గారూ! అంకితంలో కూడా కొత్త పోకడ.