ఈ లాక్‌డౌన్ కాలంలో నెలరోజుల క్రితం జరిగిన ఒక సంఘటన నన్నొక కుదుపు కుదిపేసింది. టవల్ ఆరేద్దామని ఒకరోజు ఉదయం బాల్కనీలోకి వెళ్తే, అక్కడ గ్రిల్ పైన ఒక పావురం కంగారుగా మసలుతోంది. గోడ దగ్గరగా ఒక మూల ఉన్న పాతగుడ్డల మీద పుడకలు చేర్చుకున్న పావురం తచ్చాడుతుండటంతో అది గుడ్లు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని అర్థమై నాలో అంతర్మధనం మొదలయింది.
నగరాల్లో పెరుగుతున్న జనావాసాలతో పాటు పావురాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోందని, అలా పెరుగుతున్న పావురాల వల్ల కొన్నిరకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉందని చదివిన వార్త గుర్తొచ్చింది. ఆందోళనతో పాటు భయంకూడా మొదలై ఒక క్షణం పావురాన్ని తరిమేసి, పుడకలు తీసేసి దాని బెడద వదిలించుకోవాలి అనుకున్నా. పావురం అమాయకపు చూపుల వల్లనేమో, పోనీలే నిదానంగా చూద్దామని ఆ ప్రయత్నాన్ని వాయిదావేసుకుని హాల్లోకి వచ్చేసానే కానీ పావురం బెరుకు చూపులు నన్ను వెంటాడటం మాత్రం మానలేదు. దానికి తోడు మరెన్నో ఆలోచనలు కూడా ముసురుకున్నాయి.
పావురాన్ని తోలేసి వాటినుండి వచ్చే రోగాలు రాకుండా కాపాడుకున్నా మిగతా వ్యాధులేవి రావని గ్యారంటీ ఏమిటి? అంతటితో మనం చిరాయువులుగా బతికేస్తామా? ఆ నోరులేని అల్పజీవికి ఆ పాటి ఆశ్రయం ఇవ్వలేమా? వాటికంటే మనం ఏ విధంగా గొప్ప? కేవలం వాటికంటే ఒకింత తెలివెక్కువుందనే కదా ఈ భూమినంతా ఆక్రమించేసుకున్నాం. వాటికి ఏ హక్కులూ లేవని అవి ఏ కోర్టుకూ వెళ్ళలేవనే ధీమాతో మన ఇష్టానుసారం చేస్తున్నాం. వెనకటికి రమణాశ్రమం ఏర్పడిన తొలిరోజుల్లో కోతులు, కుక్కలు ఆశ్రమంలో చొరబడి భక్తుల నుంచి పండో, కాయో నోట కరుచుకు పోతుండేవట. భక్తులు వాటిని తరమడం గమనించిన రమణ మహర్షి “మనమే ఆ మూగజీవుల స్థావరాన్ని ఆక్రమించుకున్నాం. ఆకలిగొన్న వాటి బిడ్డలకోసం అవి ఏ పండో తీసుకుంటే వాటిని తరమొద్దు. వాటిపట్ల కరుణ చూపండి“, అని వారించేవారట. కాకులకు, కుక్కలకు, గోవులకు కూడా ఆశ్రమంలో గుడులు కట్టించిన కారుణ్యమూర్తులు భగవాన్ రమణులే!
మనకంట పడిన జీవినల్లా తరిమేసి, తినేసి ఇవాళ్టి ఈ దుస్థితి తెచ్చుకున్నాం. మన దురాశ ఏ మేరకు పోయిందో కవి పాపినేని శివశంకర్ గారు ఒక కవితలో …..
`తనకోసం తను బతకటంగాదు
అన్నీ తనకోసం బతకాలన్నదే మనిషి సమస్య
బతికేవాడు అన్నిటినీ బతకనివ్వాలి గదా.
ప్రపంచం మానవుడికే సొంతం కాదు.
ప్రపంచం మనిషితోనే అంతకాదు` అన్న మాటలు పదేపదే గుర్తుకొచ్చాయి.
మరుసటి రోజు ప్రొద్దున మా పిల్లలతో నా ఆలోచనలు పంచుకుని ఆ పావురాన్ని తరిమేసే ప్రయత్నం పూర్తిగా విరమించుకుని దానికి మేత, నీరు అందుబాటులో ఉంచాము. మరికొన్ని రోజులకు అది రెండు గుడ్లు పెడితే, అందులో ఒకటి దొర్లి గ్రిల్లో నుండి జారికింద పడిపోయింది. మిగిలిన ఒక గుడ్డుని పావురం పొదగడం మొదలెట్టేసింది. తల్లిపావురం గుడ్డుని పొదుగుతున్నన్ని రోజులు ఏదో ఒక సమయంలో బాల్కనీలోకి వెళ్ళనప్పుడల్లా అది బిత్తరచూపుల్తో నన్నుగమనించడం (మనుషుల్ని నమ్మడం అంతతేలిక కాదని దానికీ అనిపించిందేమో) కొనసాగింది. ఇంకో రెండురోజుల తరువాత మా బాల్కనీకీ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ కిటికీ మీద మగపావురాన్ని గమనించా. అది దీనంగా మా బాల్కనీ వైపే చూస్తూ రోజంతా అలాగే కూర్చునుండేది. ప్రాణి ఏదైనా బేసిక్ ఇన్స్టింక్స్ అవే ఉంటాయేమో. అందుకే అన్నమయ్య బ్రహ్మమొక్కటే అన్న కీర్తనలో `కందువగు హీనాధికములిందు లేవు` అని ఎన్నో వందల సంవత్సరాల క్రితమే చాటి చెప్పారు. లేబర్ రూమ్ దగ్గర ఆతురతో ఎదురుచూసే కాబోయే తండ్రులకి, గోడపైని మగపావురానికి ఏంతేడా ఉంది? ప్రాణులన్నీ ఒక్కటే అని తెలుసుకోవడమే నిజమైన నాగరికత, జ్ఞానం.
మగపావురం నిరీక్షణ
మరికొద్ది రోజులు గడిచాక ఒక రోజు పిల్లపావురం కనిపించింది. పిల్ల బయటకు రాగానే తల్లి శ్రద్ధ మరింత పెరిగింది. దాన్ని ఎంతో వొద్దికగా రెక్కలతో కప్పి రక్షణనిచ్చి రోజులు తరబడి కాచింది. ఇదుగో ఈ మదర్ ఇన్‌స్టింక్ వల్లనే కదా నేను ఈ రోజు ఈ నాలుగు మాటలు మీతో పంచుకోగలుగుతోంది. అదే లేకపోతే ఏ జీవీ బతకలేదు. కొన్నాళ్ళకు తల్లి పక్షి మేతకోసం పోయి రావడం, పిల్ల పావురం కాస్తా పెరిగి ఎగిరి పోవడమూ జరిగిపోయాయి.
ఇదంతా జరుగుతున్న సమయంలో ఆ రోజున ఆవేశంగా పావురాన్ని తోలేసి ఉంటే ఇంతటి ఆనందాన్ని అనుభూతినీ పోగొట్టుకునే వాడ్నే కదా అనుకుంటూ రెండేళ్ళ క్రితం అమెరికా వెళ్ళినప్పుడు న్యూజెర్సీలో బావ ఆనంద్ చెప్పిన మాట గుర్తు చేసుకున్నా. అక్కడ ఒకరోజు తను పార్క్‌లో కూర్చున్నప్పుడు తీగెల మీద వాలిన పక్షులను చూసాడట. కొన్ని పక్షులు వాలి ఉన్న తీగె మీదకు ఇంకొక పక్షి కొత్తగా వాలడానికి వస్తే తీగె మీదున్న పక్షులు జరిగి వాటికి చోటిచ్చాయట. పక్షులు వాలడానికి వచ్చే కొద్దీ తీగె మీదున్న పక్షులు చకచకా సర్దుకుని కొత్తవాటికి చోటిస్తూ సర్దుబాటు చేసుకున్న తీరు ఎంతో ముచ్చటేసిందని చెప్పాడు. ఈ పాటి సర్దుబాటు గుణం మనుషులకు ఉంటుందా అంటే? సందేహంచాల్సిందే. మా బావ ఈ మాట చెప్పినప్పుడు నా చిన్నప్పటి రైలు ప్రయాణం మదిలో మెదిలింది. రైల్లో రద్దీ తక్కువగా ఉండి సీట్లు ఖాళీగా ఉంటే జనం కాస్త విశాలంగా సౌకర్యంగా కూర్చునేవారు. అలా ఉన్నప్పుడు ఏదైనా స్టేషన్లో రైలు ఆగితే కొత్తవాళ్ళు ఎక్కుతుంటే రైల్లో కూర్చున్నవాళ్ళు తెలివిగా సర్దేసుకొని ఎక్కినవాళ్ళకు కూర్చోడానికి చోటిచ్చేవారు కాదు. మరికొంత మందైతే స్టేషన్ వచ్చే వరకు ఎన్నో కులాసా కబుర్లు చెబుతూ బండి ప్లాట్ఫారమ్ మీద ఆగే సరికి కాళ్ళు చాపుకుని బార్లాగా పడుకుని దొంగ నిద్ర నటించేవారు. ఇదంతా ఎక్కేవాళ్ళకు చోటివ్వకూడదనే. అందుకేనేమో ఆరుద్రగారు ఒక పాటలో “మాయ రోగమదేమోగాని మనిషి మనిషికి కుదరదు“ అనేసారు.
పావురం ఎగిరిపోయినా ఆలోచనలు ఇగిరిపోలేదు సరికదా బైబిల్లో ఎప్పుడో చదివిన
`ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు,
కోయవు కోట్లలో కూర్చుకొనవు.
అయిననూ ఆ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నడు`
అన్న మాటలతో పాటు శేషప్ప కవి నరసింహ శతకంలో రాసిన
“అడవి పక్షుల కెవ్వడు – మేతపెట్టే …
స్త్రీల గర్భంబులన్ – శిశులనెవ్వడు బెంచె? ….
జీవకోట్లను బోషింప – నీవే గాని
వేఱెయొక దాతలేడయ – వెదకి జూడ
భూషణ వికాస! శ్రీ ధర్మ – పురనివాస“
అన్న పద్యమూ గుర్తొచ్చి ఇటువంటి నమ్మికతో జీవిస్తే దేనికీ భయపడక దేనినీ భయపెట్టకనే జీవించవచ్చని తెలుసుకున్నా.
క్రౌంచపక్షులు బోయను మహర్షిగా మార్చితే నన్ను కనీసం మనిషిగా మిగిల్చిన ఆ పావురానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నా.
https://youtu.be/F4nBFuO808Y
Chala bagundi sir… A beautiful and practical message..🙏
Sir! I have similar experience with pigeons while we were in Guntur,remembering your words that the planet belongs to them and we have encroached their habitat with human over intelligence or audacity,we adjusted to live with them,who in course has multiplied its family.
Besides two parrots used to visit and say hello to the love birds(Budgerigars)we used to domesticate in our balcony.During their first visit ,a surprise one we are not prepared to offer fruits to them and felt bad.Then immediately we bought some guvas,from next day onwards every day early morning we used to keep 2guvas.The 2 parrots used come and have their breakfast in my balcony along with the love birds.Of the two one was skeptic about us,therefore she used to come and immediately go with the guva tucked in its beak.The other parrot was friendly and confidence on our human nature.
It was in Guntur we visited Bommana Kedareeswara rao’s bird sanctuary who has love to domesticated birds of different kinds out of love for them serving the as service on the banks of river Krishna,near Manthena Satyanayanaraju nature Ashram.He never sold any birds nor allowed visitors,unless we are known to him.Thank you very much Sir for sharing your real love story with the pigeons,an inspiring one
మనసులోని భావాలను పంచి మరచిపోతున్న మంచిని పెంచటానికి మీరు చేస్తున్న ప్రయత్నం వృధాకాదని విశ్వశిస్తున్నా!
A wonderful n real story. Nothing can give more happiness than nature. A small observation n idea made so much difference.It speaks volumes. Your manners are instant coffee. This is a spiritual feast. congratulations Hardhavardhan garu.
మా హర్షవర్ధన్ కవితలో ఓ చేయి తిరిగిన రచయిత,కవి ప్రస్ఫుటంగా
చూసాను…యింక ఎన్నో ఎన్నెన్నో
ఆశిస్తున్నాను…భద్రాజి ఆర్టిస్ట్ అమలాపురం…
Most meaningful message to the human being. Looks very interesting as message is with pegeon pics.
Excellent presentation of a personal experience !!
Chala chala baga chepparu sir.manchi manchi vatito polchi voka marichipolayni vidhan ga kadha sagindi sir.
Heart touching story anna…we need to allow all to leave….Leave and let leave others…..
A wonderful and practical message sir.
🙏
చిన్న విషయం అనిపిస్తుందేమో చాలా గొప్ప భావన మనసుని తడిమింది.. మధ్యలో రమణ మహర్షి, అన్నమయ్య, బైబిల్ ఉదాహరణలు సందర్భౌచిత్యం సంతరించి పెట్టాయి. మీకు అభినందనలు
Beutiful musings
Very nice Sir
Good one to live let it live all one
Wonderful message to the human beings.
చాలా బాగా చెప్పారు సార్.
ముందు తరాలకి ఇది నేర్పించటం చాలా అవసరం.
మనుషులు దైవత్వం వైపు వెళ్ళుటకు జీవ నం సాగించక పోయినా కనీసం మానవత్వం వీడకుండా బతకాలని మనసారా కోరుకుంటున్నాం. బాగుంది
ఆత్మవత్ సర్వ భూతాణి అన్న ఆర్ష వాక్య పరమార్థాన్ని ప్రస్ఫుటంగా ధ్వనింపజేస్తూ ప్రపంచం సర్వ ప్రాణికోటికీ చెందింది అనుకున్నప్పుడే మానవకోటి మనశ్శాంతితో మనుగడ సాగించగలదన్న సత్యాన్ని తెలియజేయడానికి కపోతాన్ని ఎగరవేసిన తీరు మనోహరం
👍🏻👍🏻👍🏻
Very nice story with a beautiful moral , everything around us and part of nature have always benefitted humans on the contrary they themselves were never benefited in return. We should live and let live
Awesome. Nice indulging, inspiring and thought-provoking story. 🙏🙏🙏
కాదేదీ కవిత కు అనర్హం అని శ్రీ శ్రీ గారు అన్నట్లు స్పందించే హృదయం ఉన్న వారు దేనికైనా స్పందిస్తారు వారి అనుభూతి ని చక్కగా వివరిస్తారు.
చాలా బాగా విశదీకటించారు మీ అనుభవాన్ని, భగవంతుడికి పూజ చెయ్యడం అంటే గుడులు గోపురాలు తిరగడం కాదు, సాటి ప్రాణులకు సేవ చెయ్యడమే అది మనతోటి మనుషులైన పక్షాదులైన, అన్నది నా నమ్మకం. ఇలాంటివి మీరు చాలా చేసారు చేస్తున్నారు కూడ దానికి ఇది ఒక మచ్చుతునక.
ఈశ్వరానుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ……
Choolali garbamandu yemukalu yereethiga yedugunadi neeku theliyadu, gaali ye thovanu vatchuno new verugavu, alagunane samasthamunu jariginchu DEVUNI kriyalanu new verugavu. (Prasangi 11:5)
The situations mentioned in your blog are palpable and many of us would have experienced. After reading the incidents in the blog most of the people realise to observe even ants and do the needful for the well being of the environment.
Dear Hersha ,your writings are very naturel . I am enjoying them. They are thought provoking and mmemarable . If possible I want to write in telugu. My knowledge is not permiting.
I will try next time taking help of grand son.
చాలా బాగుందండి. సహజ ఆవాసాలు కోల్పోతున్న ఎన్నో ప్రాణుల మూగ నిత్య పోరాటం ఇది. నిశిత పరిశీలన.
మానవత్వం అంటే ఇదే.చేతులెత్తి దండం పెడుతున్నా .
మనసులో అందమైన ఆందోళన కలిగించారు సర్ లోపలి అరలను తడిమారు🙏🏼
బాగుంది. ఫొటోలు కూడా పెట్టటం కథనానికి లైఫ్
ఈ కథ మీ సంస్కారానికి అద్దం పడుతోంది.ఇవాళ నూటికి 90 మంది జంతువులు, పక్షులను రాళ్లతో కొట్టి వాళ్లే.అందుకే ప్రపంచం అనేక ఉపద్రవాలను ఎదుర్కొంటున్నది.
Adbhutam Sir
Very good concept..well narrated
Excellent Sir! కథలో మనిషితనం గురించి చాలా చక్కగా చెప్పారు. మీకు ఎదురైన పరిస్థితి / అవకాశం అందరికీ వస్తుంది. కానీ దానిని ఇలా అదృష్టంగా మార్చుకోగల మనసు కొందరికే ఉంటుంది. చివరగా మీ చివరి వాక్యానికి శతకోటి నమస్కారాలు!
“క్రౌంచపక్షులు బోయను మహర్షిగా మార్చితే నన్ను కనీసం మనిషిగా మిగిల్చిన ఆ పావురానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నా.”
– సూర్య ప్రసాద్, పడాల చారిటబుల్ ట్రస్ట్, కాకినాడ
Beautiful interpretation to your reflections Harsha. Need many such musings to change the attitude of the humans.👌👌👌👌👏🏻👏🏻👏🏻👏🏻
Sir,I am Nethajee,DCTO.Rtd. How are you sir. This story is very nice sir. ThanQ sir
So true. Live and Let live should be the mantra of life. As it was mentioned so well about Doves creating health issues in the recent news, what about Covid virus, not seen by naked eye, yet killing countless people all over. Love every living being and in the end we are sure to get it back🌹
Nice of you andi to point out how to treat other living beings in a kind way.
It’s a wonderful thought that ignited in your mind. And nicely connected related references which enhanced the beauty.
It highlights ‘Live happily & Let Others be Happily’.
Every organism has right to live & has its own share on the Planet Earth.with this Biodiversity, life is expected to be existing. Dismantling this sequence of life systems creates new forms life like present pandemic that may rectify orderliness.
Enjoyed while reading the real life account.
Thank you for sharing.
The humanitarian attitude towards the pigeon is very touching Harsha.
Awesome.