బాల్యం బంగారుమయం. అమ్మమ్మల ఇళ్ళలో గడిపిన బాల్యం మరింత బంగారుమయం. మాకు పది పన్నేండేళ్ళు వచ్చేవరకు ప్రతి ఎండాకాలం సెలవలకు మా అమ్మమ్మగారి ఊరు రేపల్లె వెళ్ళే వాళ్ళం. అప్పట్లో కాఫీ పొడి కోసమో, కందిపప్పు కోసమో కారుమూరి వెంకటేశ్వర్లు గారి కిరాణా కొట్టుకు పోటీపడి మరీ పిల్లలందరం నిద్రకళ్ళతో పరుగెట్టే వాళ్ళం. ఒక ఇంట్లోనే ముందు గదిలో ఉండే ఆ కొట్టే ఆ రోజుల్లో మాకు అపురూపం, అద్బుతం. వర్క్‌ఫ్రమ్ హోమ్ అనేది ఇదుగో ఇలా మన దగ్గర ఎప్పుడో మొదలయ్యింది. నిజానికి మనది ఇంకా అడ్వాన్స్‌డ్ వర్షన్. మన దగ్గర హోమే వర్క్ ప్లేస్. కనుక మనమే గొప్ప (అన్ని మన వేదాల్లో ఉన్నాయష అన్నట్లు కాదు లెండి.) కారుమూరి వారు కొట్లో కూర్చుంటే కొట్టు వెనకరైలు బోగీల్లో వరసగా నాలుగైదు గదులుండేవి. అదే వారి ఇల్లు. ఎంత మంది కష్టమర్లొచ్చినా ఒకే ఒక్కడు అందరు అడిగినవీ చకచకా తీసిస్తూ నోటితోనే లెక్క చెప్పేసి డబ్బులు తీసుకోవడం, నెలవారి ఖాతాల వాళ్ళకు ఖాతా పుస్తకంలో లెక్క రాసేసి పంపేయడం అలా అలవోకగా జరిగిపోతుండేది.
మా చిన్నతనంలో ఏ వస్తువుకైనా అందరం పోటీపడి కారుమూరి వారి అంగడికి దూసుకుపోవాలనుకోవడం వెనుక రహస్యం ఉంది. ఆ కొట్లో ఏ సరుకుకొన్నా కొసరు బెల్లం అడిగేవాళ్ళం. కొసరు అడిగిన వెంటనే రిఫ్లెక్స్ ఏక్షన్లా ఆయన ఎదురుగా ఉన్న బెల్లం దిమ్మపై ఇనపరాడ్తో ఒక్క దెబ్బేస్తే పెద్దబెల్లం ముక్కరాలిపడేది. మేము ఆ పెద్ద బెల్లం ముక్కకేసి ఆశగా చూస్తుంటే ఆయన దిమ్మపక్కన పడిన చిన్నబెల్లం పలుకులను మా చేతిలో పెట్టి పదపద అనేవాడు. కొసరు అడిగిన ప్రతిసారి బెల్లం దిమ్మను కొట్టడం మేము ఆశపడటం, ఆయన చిన్న పలుకులతో సరిపెట్టడం. ఎన్నోసార్లు ఇదే తంతైనా మేము ఆ పెద్దబెల్లం ముక్కకోసం ఎదరుచూడటం మానుకోలేకపోవడమే ఆ పసివయసు ముచ్చటే.
కారుమూరి వెంకటేశ్వర్లు గారి భార్యపేరు ధనలక్ష్మిగారు. కొట్లోనుంచే ఆయన ధనం, ధనం అని పిలుస్తూనే ఉండేవాడు. అలా పిలవగా పిలవగా ధనం (ఇంట్లో ధనలక్ష్మి) పెరుగుందనేమో! ఎప్పుడైనా ఆమె ఆయనకిచ్చిన కాఫీలో తీపి తగ్గితే తన ముందున్న పంచదార చెత్తో చిటికెడు వేసుకుని చెవిలో వున్న పెన్సిల్తో గిరగిరా తిప్పుకుని తాగేసేవాడు. పొట్లాలు కట్టడం, నిచ్చెనెక్కి సరుకులు తియ్యడం, బస్తాల్లో సరుకులు తోడటం వేగంగా చేసేస్తూ సింగిల్ హేండ్‌తో డ్రమ్స్ శివమణిని మరపింపచేసేవారు..
రూపుమారిన మా కారుమూరివారి కొట్టు
ఏమైనా ఆ వయస్సులో కొసరు బెల్లం జ్ఞాపకాన్ని మించిన తియ్యని జ్ఞాపకం ఇంకేది ఉండదు. బెల్లం మహత్యమే అలాంటిదేమో. బెల్లం జీడీలు, బెల్లం కమ్మర్ కడ్డీలు పిల్లలకి పడేస్తే అవి మెల్లగా నములుతూ (గబగబ నమలడానికి అవి వీలుపడనివ్వవు) అరమోడ్పు కన్నులతో తన్మయత్వంతో ఓలలాడే దృశ్యం ఇంకా నాకు ఆకుపచ్చని జ్ఞాపకమే. బెల్లం మన దైనందిన జీవితంలోనే కాక మన సంప్రదాయాల్లో కూడా ఎప్పడు భాగంగానే ఉంది. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు బెల్లం, శ్రీరామనవమి ప్రసాదాలలో బెల్లం పానకానిది ప్రత్యేక స్థానం. లలితా సహస్ర నామాల్లో “గూడాన్న ప్రీతిమానసా“ అనేది ఒక నామం. బెల్లంతో చేసిన పరమాన్నం అమ్మవారి మనస్సుకి ప్రీతి కలిగిస్తుందని దీనర్థం. ఏ దేవతారాధనలోనైనా బెల్లాన్ని నైవేథ్యంలో సమర్పించడం సంప్రదాయం.
ఆయుర్వేద వైద్యంలోనూ బెల్లానికి ఎంతో ప్రాధాన్యముంది. పెళ్ళిళ్ళకు పానకాలతో వియ్యంకుల్ని స్వాగతించడం, ముహుర్త కాలంలో బెల్లం జీలకర్ర నెత్తిన పెట్టడం అందరికీ తెలిసిందే. చిన్నప్పుడు దసరాకు `అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు` పాట పాతతరం వాళ్ళందరికీ ఎరుకే. మన సంప్రదాయంలో దశదానాల్లో గోవు, భూమి, బంగారం, వెండి, వస్త్రాలతో పాటు బెల్లంకూడా ఉండటం గొప్ప విశేషం.
పంచదార వచ్చిన తరువాత బెల్లం గ్లామర్ కొంత తగ్గినా బెల్లం రుచే రుచి, పంచదార వొత్తి స్టేటస్ కే. తెనాలి సత్యనారాయణ టాకీస్ రోడ్డులో అమ్మే బెల్లం జిలేబి, తూ.గో.జి. బెల్లం గారెలు అద్భుతం. మన వసంతవాడ చెఱుకు పానకం ముందు అమెరికా వాళ్ళ హెర్షీస్ సిరప్ దిగదుడుపే. బెల్లం బూరెలు, బెల్లపు అచ్చులు, బెల్లం పప్పుండలు, బెల్లం పూతరేకులుగా. ఇవి చాలవన్నట్లు మన పులుసులో పచ్చళ్ళల్లో, సాంబార్లలో కూడా బెల్లం చేర్చితేనే అవి సమగ్ర మై, రుచి మరుగుతాయి.
బెల్లం నోటికే కాదు మాటల్లో సామెతల్లోనూ తీపెక్కింది. బెల్లంతో నిత్య సాంగత్యం చేసే బెల్లం రాయి ఎలాంటి రసానుభూతీ పొందదు. అందుకేనేమో ఏ స్పందనా లేని మనిషిని “బెల్లం కొట్టిన రాయి“ అని అంటారు. ఇది కన్యాశుల్కంలో గిరీశం గారు బుచ్చెమ్మొదినకు “బొత్తిగా లవ్ సిగ్నల్స్“ తెలియవు అన్నట్లుగానే. బెల్లపు పొయ్యికి ఈగలే నిదర్శనం, `బెల్లం ఉందని మో చేతిదాకా నాకినట్టు, బెల్లం ఉన్న చోటే ఈగలు ముసురుతాయి. బెల్లం పారవేసి ఆకు నాకినట్లు, బెల్లము వండిన పొయ్యి, ఇంగువ కట్టిన గుడ్డ వంటి సామెతలతో పాటు బెల్లం గురించి ఇంకా ఎంతైనా చెప్పొచ్చు కాని సెన్సార్ వారి మీది గౌరవంతో కించిత్ సంయమనం పాటిస్తున్నా. మరీ కోపం వచ్చిన అత్తగారు కొడుకుతో “నీకు పెళ్ళాం బెల్లమైపోయింది, అమ్మ అల్లమైపోయింది“ అనే సామెత పుట్టుకొచ్చింది. పాపం ఎన్ని ఔషధగుణాలున్నా, బెల్లం తీపిముందు ఇలా అల్లం తేలిపోవడం బ్రహ్మరాతే.
బ్రహ్మరాతే అనగానే ఇంకో విషయం గుర్తొచ్చిందండోయ్. ఒకనాడు బెల్లంగారు బ్రహ్మదేవుడి దగ్గరకు పోయి, “పళ్ళు ఉన్నవారు, లేనివారూ నన్ను చప్పరించేస్తున్నారు, అందరికీ నేను మరీ అలుసైపోయా“ నని మొరపెట్టుకున్నారట. ఇది విన్న విధాత“ నిన్ను చూసి నేనే నా మనసును నిగ్రహించుకోలేకపోతున్నాను, నువ్వు ఇంకొంచెంసేపు ఇక్కడే ఉంటే నేనే చప్పరించెయ్యగలను“ అనడంతో బెల్లం గారు భూలోకానికి జారుకుని మనకే సొంతమయ్యారు. ఇది కథే అయినా “బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు“ అన్న వేమన్నమాట బెల్లానికీ వర్తిస్తుంది.
ఇంత ఘనచరిత్రగల బెల్లం మన ఇళ్ళ పేర్లనూ అలంకరించింది. బెల్లపువారు, బెల్లంకొండవారు ప్రసిద్దులు. సాహిత్యంలోకూడా బెల్లం ఎన్నో చోట్లా ప్రస్తావించబడింది.
కాటమరాజు కథలో 14వ శతాబ్ధంలోనే కట్టెబోయిన మారయ్య రాసినట్లుగా ఉన్న “కాటమరాజు పట్టాభిషేక“ సందర్భంలో జరిగిన విందులో బెల్లపు అచ్చుల ప్రస్తావన కానవస్తుంది.
“పేరిన నేతులు బెల్లపచ్చులును
పన్నెండు పిండి వంటలు పాల కడియములు“ అని చేశారు.
15వ శతాబ్దికి చెందిన శ్రీనాధ మహాకవి రాసిన భీమఖండం లో శిష్యులతో పాటు వ్యాసునకు అన్నపూర్ణాదేవి కాశీ మహానగరంలో భోజనాలు పెట్టిన సందర్భంగా “గుడఖండం“ అనగా “బెల్లంముక్క“ను వడ్డించారని చెప్పబడి ఉన్నది.
పదహారవ శతాబ్దికి చెందిన తాళ్ళపాక తిరువేంగళనాధుడు రాసిన “ద్విపద పరమయోగి విలాసము“లో యోగుల విందారగింపు సందర్భంలో బెల్లపుటచ్చుల ప్రస్తావన ఉంది.
ఇంతెందుకు మన పాత బస్తీ హోమ్‌మేడ్ గుడుంబాలో కూడా బెల్లమే ముఖ్యమైన దినుసట.
కవి ఇస్మాయిల్ గారు ఒక మినీ కవితలో…
`పటిక బెల్లం తింటుంటే
పాప చూసి, ఆగింది
దానికి పెట్టాక ఇంకా తీపెక్కింది బెల్లం` అని పిల్లల ప్రేమతత్వ్తాని ఆస్వాదించారు.
ఇటీవలే ఆత్మీయుడు చింతకింది శ్రీనివాస్ `ఉడుకుబెల్లం` పేరుతో మంచి కథాసంకలనం విడుదల చేసి పాఠకుల్ని ఉడుకెక్కించాడు. బెల్లాన్ని ఒక పిసరంత కొసరుగా కాకుండా విసురుగా వడ్డించాడేమిటా అని కసురుకోకండి. (మధుమేహులు మన్నింప మనవి)
(బెల్లానికి కొసరుసంగతులు అందించి రుచి మరింత పెంచిన తమ్ముడు లక్ష్మీప్రసాద్‌కు, మిత్రులు రంకిరెడ్డి రామ్మోహన్‌రావుగారికి కృతజ్ఞతాభివందనాలతో)
ఇప్పుడే మీ టపా మళ్లీ చదివాను….
వేయించిన వేరుశెనగ పప్పు, బెల్లం జతచేరితే అబ్బో ఆ రుచి వేరే చెప్పాలా? ఇవాల్టి ఈవినింగు టీ కాలక్షేపం బెల్లపు తీపి కబుర్లు…మీలోని కథకునికి, కబుర్లకీ వేవేల వందనములు.
చిన్న నాటి అనుభవాల ను కొసరు బెల్లం తో మా అందరి లో తట్టి లేపారు గురువర్యులు. నిజంగా మా గ్రామంలో నా చిన్నతనంలో అదే అనుభవం గుర్తుకు వచ్చి మనస్సు పులకరించింది. కోమటి రాజయ్య తాతను మరువలేదు.
చిన్ననాటి చైతన్యం కనులముందు
కదలాడింది అంటే అతిశయోక్తి కాదని మనవి.
KOSARU BELLAM THINNATLUGA UNDI. EXCELLENT..
Sir
KOSARI BELLAM recollected my child hood days during our stay at our grand mother house at Kakinada. Really sweet and heart touching.
Adbhutam. Chinnanaati gnaapakaalanni gurthuku vachhayandi. Mee kadhanaasailiy Baagundandi
కొసరు బల్లం కసిరి కొసిరి వడ్డించారు సర్ . ఆహా ఎంత మధురం!!! మన ఈడు వారందరూ కొద్దో గొప్పో ఈ కసరి బెల్లం చవి చూసినవారే కానీ మీరు తెనిగించిన మీ చమక్కు కు దాసోహం🙏🏼🙏🏼🙏🏼
Nice one
Anna good about Bellam anna I stopped eating sugar…now using more bellam for tea coffee…ragi java……but too taste anna…
Very nauseating….
Remembering childhood
Very well put forward
హర్షా, మీ కొసరు బెల్లం చాలా రుచిగా ఉంది. చిన్నప్పటి అనుభవాల్ని ఒకసారి గుర్తుకు తెచ్చింది. ఆ రోజుల్లో తినడానికి ఏమైనా పెట్టమని మా అమ్మ ను అడిగితే (ఇంట్లో ఇప్పటి లా ఏదో ఒకటి రెడీ గా ఉండేది కాదు కదా) దోసెడు నిండా వడ్లు షర్ట్ లో పోసేది. వాటిని తీసుకెళ్ళి మాఇంటి పక్కన ఉన్న శెట్టి అంగడిలో ఇచ్చి బెల్లం కొనుక్కొనే వాళ్ళం. అప్పుడు రెండు రకాల బెల్లం వచ్చేది. ఒకటి అచ్చు బెల్లం. ఇంకోటి గుండు బెల్లం. అచ్చు బెల్లం ను చక్కెర బెల్లం అనే వాళ్ళం. చక్కెర లాగా కర కర లాడుతుంటుందని. బెల్లం ముక్క ను బుగ్గ న పెట్టుకుని చప్పరించేవాళ్ళం.
ఆరోజుల్లో మా నాన్న ఎద్దుల కు పెట్టడానికి నాసిరకం బెల్లం తెచ్చేవారు. దాని లో ఏమైనా కొంచెం మంచి ది ఉంటే ఏరు కొని తినే వాళ్ళం. ఇప్పటి పిల్లల కు బెల్లం అంటేనే తెలియకపోవచ్చు.
చాలా బావుంది అండి.sugar తో compare చేస్తే బెల్లం ఆరోగ్యం అంటారు.మా చిన్నప్పుడు మా మేనత్త నాన్నగారికి డయాబెటీస్ అని పంచదార బదులు బెల్లం వాడేవారు
బాల్య స్మృతులు చాలా బాగా ఆవిష్కరించారు,చదువుతుంటే నాకు అలాంటి స్మృతులు జ్ఞప్తికి వచ్చాయి
ఇది అందరి కథ. ఈ తరం వారు స్పెన్సర్లు, రత్న దీప్ లో లేదు. మాది పిచ్చయ్య కొట్టు. సబ్జెక్ట్ సేమ్. మా పిచ్చయ్య వెళ్ళగానే బెల్లం ముక్క పెడతాడు. మమ్మల్ని వెయిటింగ్ లో పెట్టి పెద్దవాళ్ళ పట్టీలు కడతాడు. ఇది గాక మధ్యలో గోలీలు, అంతా కలిసి చాలా ఆలస్యం, ఇంట్లో తిట్లు.
Remembered childhood memories.
Bellam gare la bavundi
మిత్రమా..బెల్లం భాగోతం adduuurrrsssuuu… అదేదో మూవీ లో బెల్లం అంటేనే ఇష్టం అని మాటతో
నవ్వులు పూయించారు… యింకా
బెల్లం తాళికలు, బొబ్బట్లు,కొబ్బరి ఉండలు,కొబ్బరి నౌజు,అన్నవరం ప్రసాదం,ఒక్కటేమిటి ఎన్నెన్నో రుచులు
బెల్లంవల్లే…ఇప్పుడు బెల్లానికి మంచి
గిరాకీ.కంగ్రాట్స్ మిత్రమా…
బెల్లమంత తీయగా చిన్న నాటి జ్ఞాపకాలను అందరికీ అందించారు. అమ్మమ్మల ఇంట్లో ఈ కారుమూరి వారి all in one షాపులు మన తరం, మన ముందు తరం వారందరికీ బెల్లమంత తీపి కబుర్లే అనడంలో అతిశయోక్తి లేదు.
నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు ఆ షాపు యజమానికి ఏ పిల్ల లేక పిల్లడు ఏవరివాడో, ఏ ఇంటికి వచ్చాడో, తిరిగి ఎప్పుడు వెళతాడో నిక్కచ్చిగా ఎరుకే. ఓరే మంగిన వారబ్బాయి అనో, కురెళ్ళ వారమ్మాయి అనో బెల్లమంత తీయని పలకరింపు జ్ఞాపకాలను కాలం చెరిపేయలేక పోయింది. ఇవన్నీ గర్తు చేసిన మీ రచనా చమత్కృతి, కథా కధనం బెల్లమంత తియ్యగా ఉంది.
తీయని బాల్యాన్ని అంతే తీయని బెల్లం తో కలిపి ఎంతో బాగా చెప్పారు! ఒక్కసారి మా వూళ్ళో శెట్టిగారు పెట్టే బెల్లం, బద్దశనగలు (పుఠానాలు) గుర్తొచ్చాయి. సెన్సార్ అయిన “ముద్దు బెల్లాలు” పుణికి ముద్దెట్టుకునే భాగ్యానికి ఈ డైపర్ల యుగంలో స్వస్తి పలకాల్సిందే! ఇక గుడుంబా ప్రసక్తి తెచ్చారు కాబట్టి, ఉద్యోగ పర్వంలో కూడా బెల్లం ప్రముఖపాత్రే వహించింది! నల్ల బెల్లం పట్టుకుంటే కోర్టు మందలింపు! అందుకే కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని శరణువేడాల్సివచ్చేది. Gur Act ..దాన్ని గర్ యాక్ట్, గుర్ యాక్ట్ అనాలో తెలిసి చచ్చేది కాదు. అయ్యా!
డ కారాన్ని హిందీ జీవులు ర కారం గా వ్రాస్తారు..సో అది గూడ్ యాక్ట్ అనాలని ఒక ఉవాచ!! సీజ్ చేసిన బెల్లాలు స్టేషన్లలో కరిగి, కారి అదోక సమస్య!! ఏదైతేనేం ..మళ్ళీ వేరుశనగ పప్పుండలు బెల్లంతో తిన్న ఫీలింగ్ ఇచ్చారు!
పి.యస్: అమృతరసాజము, గడోలము, చెరకడము, ద్రువజము…బెల్లానికి పర్యాయ పదాలు!!
నమస్తే సార్!
The Kosari Bellam is a true story with everybody. It took us to those sweet memories. A wonderful narration with correlation of different episodes of Mahabharata n the latest mentions about belle. It is not only the Bellam. But it’s free offering or kisses belle is the real sweetness of it. It reflects the people’s real affection n love for the children in those days.
Congratulations Hardhavardhan garu.
చాలా బాగా ఉంది సర్…అందరిని ఒక్కసారిగా బాల్యం రోజుల్లోకి తీసుకొని వెళ్లారు…
నిజంగా బెల్లం తిన్నంత తీపిగా, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు ఓచాయి
Bellam yokka goppatanam maha thipiga rachincharu…vidaathake tappaledu aasha bellam mida..
Katha nadipinchina teeru, bellam yokka mulaala gurinchi teliyajeyadam gammathuga undi..
Diabetes valaki kuda bellam okkinta kosaranta tinochandoy😀…
Very sweet childhood memories HARSHA. 💐
Balyapu Bellam theepi gurthulu eegalla musurukunnayi. Rayala seemalo ekkuvagaa untabellame. Chinnasize laddoola untayi. Mangalavarapu santhalo sarukulu konnaka Settygaru prematho ichche bellam Mukka tho vaari vyaapaaram Kalisi vachchedi.Mee sahithyapu merupulu nannu abbura parachayi.
👌
కేవలం చిన్ననాటి స్మృతులే కాకుండా సాహిత్యం తో మేళవించి చెప్పడంవలన బెల్లపు రుచి పెరిగింది. ఎన్నిటినో గ్రంథరాజాలను తిరగేస్తే తప్ప ఇంతపోపు సరుకు దొరకదు.
మీకు అభినందనలు. అలాగే మీకు సహకరించినవారికికూడా.
I also spent my childhood in Repalle.I still have my sweet (Bellam)memories of sweets of Tenali. Thank you very much Harsha.
Even now when I go to a sweet shop, some other item for tasting will be asked.Good old habbits die hard
With this, I also recollected my childhood days, almost similar to your experience. Undoubtedly, sweet & heart touch life events like ‘ Bellam’ in our thoughts.
Here, kosaru bellam may be sweeter than larger piece which gives vegatu. Kosaru reminds us strong remembering capacity in human mind.
Wants to have more & more may drive us to live enthusiastically in the life track.
Very nicely narrated. Also highlighted the behaviour of the business man.
I also used to go for kosaru Bellam to Venkateswarlu Kottu at 11 th line Arundelpet GUNTUR. Same setting of shop. While I was in Tenali had Satyanarayana talkies jilebi many times. In Tenali taluka bellam is extensively manufactured. For better colour they mix Hydrose.
Every sentence brought great childhood memories.
Thank you
Sir I got back to memories of 50+ years – extremely happy. This is nothing but “immunity”.