EYES THAT LOOK ARE

COMMON EYES

THAT SEE ARE RARE

రోజూ నడిచే దారైనా రాత్రి వర్షానికి రోడ్డుపైని పూలవాన చూడం. వర్షానికి తడిసిన మట్టి వాసన తెలుసుకోం. గుడి బయట బీద బిక్షు వర్షీయసిని చూడం. గుళ్ళోకి వెళ్లగానే దేవుడ్నీ చూడం. కళ్ళు మూసేసుకుంటాం. సిరియా వలసబాధల్లో మరణించిన మూడేళ్ళ పసివాడైన అలన్‌ కుర్ది ఫోటో పలువురికి షేర్‌ చేస్తాం. మన వీధి చివర ఆకలితో నిలుచున్న పసివాడ్ని కేర్‌ చేయం. ఇంటికి వచ్చిన అతిథుల్ని ‘సెల్‌’ నుండి మరలి చూడం. గొప్ప డాక్టర్ అయిపోయాక టెస్ట్ రిపోర్ట్స్ లోకి తప్ప పేషెంట్ ముఖంలోకి చూడం.

1993 లో దక్షిణాఫ్రికా కరువు రోజుల్లో కెవిన్‌కార్ట్‌ అనే జర్నలిస్టుకు ఉత్తమ ఫోటోగ్రఫీకి పులిట్జర్‌ బహుమతి లభించింది. ఒక పసిపాస మరణంకోసం ఎదురుచూస్తున్న రాబందు ఫోటోకు ఈ బహుమతి లభించింది. కాని ఆ బహుమతి అందుకున్న కెవిన్‌ తన 33 ఏటే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంత కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కెవిన్‌ ఆత్మహత్యకు కారణం అతను అనుభవించిన అపరాధ భావనేనట.

పులిట్జర్‌ బహుమతి పొందిన సందర్భంలో కెవిన్‌ను ఇంటర్వ్యూ చేసిన మరొక జర్నలిస్ట్‌ కెవిన్‌ను ‘‘మీరు ఆ ఫోటో తీసేటప్పుడు అక్కడ ఎన్ని రాబందులున్నయి?’’ అని అడిగితే కెవిన్‌ ఫోటోలో ఉన్నదొక్కటే అని చెప్పగానే ఇంటర్వ్యూ చేసే అతను “లేదు లేదు, ఆ రోజు రెండు రాబందులున్నయి. రెండో రాబందు మరేదో కాదు నీ కెమేరానే” అని చెప్పి, ఆ ఫోటో తీసేందుకు ఉత్సాహం చూపడం కంటే ఆ పసిపాపని దగ్గర్లోని రెస్క్యూ హోమ్‌కు తీసుకెళ్ళి ఉంటే ఆ పాప బ్రతికేదేమో కదా అని కూడా అన్నాడట. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే కెవిన్‌ అపరాధ భావనతో, తీవ్ర పశ్చాత్తాప హృదయంతో జీవితం చాలించాడు. Sensitiveness is a sensible trait than sensation అనేది వాస్తవం.

అందుకేనేమో తిరుమల గుడిలోకి వెళ్ళేప్పుడు అక్కడి అర్చకస్వాములు ‘‘స్వామిని చూడండి, స్వామిని చూడండి’’ అని హెచ్చరిస్తుంటారు. గౌతమబుద్ధుని ప్రధాన బోధనైన అష్టాంగ మార్గంలో మూడు విభాగాలలో ఒకటైన ‘ప్రజ్ఞ’ అన్నింటినీ తాత్త్విక దృష్టితో పరిశీలించమని చెబుతుంది. ప్రజ్ఞ మనసును శుద్ధి పరచే జ్ఞానము. ఇందుకు అవసరమైనది ‘సమ్యక్‌ దృష్టి’ అనిపించేలా కాకుండా భ్రమకు లోనుకాకుండా ఉన్నది ఉన్నట్లు చూడగలగడం.

ఏవి చూడకూడదో, ఏవి ఎలా చూడాలో ఎవరైనా ఒక కోర్సుగా మనకు నేర్పితే ఎంత బాగుండు! ఇవన్నీ చూసేనేమో పాల్‌గాగెన్‌ అనే తత్త్వవేత్త “I Close my eyes so I can see” అనేసాడు. మన మహానగరాల్లో అపార్ట్‌మెంట్స్‌ గురించి ఒక కవి ‘ఈ అపార్ట్‌మెంట్ల పుణ్యమా అని మనకు కనపడాల్సిన సూర్య, చంద్రులు, నక్షత్రాలు కనపడటం లేదు కానీ కనపడకూడనివన్నీ కనపడేస్తున్నాయి’ అని వాపోయాడు.

ఇకనుంచైనా మనం కూడా కళ్ళు తెరచో మూసుకునో చూడవలసినవి చూడవలసిన విధంగా చూసే ప్రయత్నం చేద్దాం.

19 Replies to “చూడటం”

  1. మాట్లాడగలగడం ఒక కళ. …దీని వల్ల ఆనంద తప్ప రాకపోతే నష్టం లేదు…..కాని …..the quality raised by author is so very critical n lack of it makes us inhuman…..thus aspect has been very well sensitized in this brief write up…
    Congrats

  2. Helping hands are better than praying lips annatu Sir
    Being sensitive to others,sitiations is what we are missing these days..blaming it on our busy schedules..akin to few people who stop the vehicles side by to lift a person who accidentally fell down in traffic..where many of us including me see the same from sitting inside the car..andaru busy ne..those who respond..great..

  3. Dear sir
    Your insight into ” seeing”gives us a glimpse into what is the real seeing into the living truth of everyday life
    It reminds us of all our sages and seers of the past whi walked this holy land where we remained just as onlookers
    I hope you come back again with deeper dimensions of seeing out and seeing into oneself
    I wholeheartedly cherish your vision

  4. చూడటం లోని లోతు పాతుల్ని బాగా చెప్పారు సర్…మాములుగా చూడారం వేరు…కెమెరా కన్ను లోనుంచి చూడటం వేరు….మీరు ఉదహరించిన కెవిన్ గారి ఫోటో మా pgotographers ఫీల్డ్ లో చాలా మంది మనసుల్ని కలచి వేసింది…ఫోటో తీసిన తరువాత ఆయన బాబు ని save చేసి ఉండ్చ్చు…..

  5. హాఁ అన్నా! “చూడడటం” ను కూడా ఓ చూపు చూడగలగడం నీకు మాత్రమే సాధ్యమని దీని వల్ల తెలుస్తుంది. Crispy and hitting the bull’s eye. 👌😊

  6. ప్రకృతి లో దర్శించాల్సినవి చాలానే ఉన్నాయని ఎటొచ్చీ మనస్సుతో చూసి స్పందించడం అనేది మానవత్వం అనిపించుకుంటుందని చక్కగ చప్పారు సర్🙏🏼😅——చలం

  7. చూడటం ఒక glance మాత్రమే అనిపించింది. మంచి టాపిక్ మరింత లోతుగా డీల్ చేసి ఉంట బాగుణ్ణు అనిపించింది.

  8. చెప్పవలసిన అంశాన్ని సూటిగా చెప్పారు. తప్పు చేస్తుంటారు, కాని పశ్చాత్తాపం చెందడం చాల అరుదు.
    మంచి కథనాన్ని అందించిన మీకు అభినందనలు.

  9. Sir, Amazing write up on the subject 👀

    It’s true that the world has selective seeing and you have articulated the contents very short and given the shot👌🏻🙏🏻

  10. అద్భుతం సర్…లో చూపు తో మీరు రాసిన ఈ రచన మనసుని కదిలించింది.

  11. నమస్తే సార్
    చూడటాన్ని చాలా గొప్పగా చూపారు
    అభినందనలు
    ఆంజనేయ రెడ్డి సుమశ్రీ

    1. What a sensitive person. Camera is not a living being. May be he could have taken the boy afterwards to his parents/ hospital.

    2. చూడడం అనేది ఎంత కష్టమైన విషయమో తెలిపింది. భగవంతుని ప్రసాదించిన కళ్ళకు సార్థకత చేకూరుద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *