కొన్నేళ్ళ క్రితం టి.వి.లో పద్మశ్రీ అవార్డుల ప్రధానోత్సవాన్ని చూస్తుంటే ఎవరో చొక్కాలేనాయన స్టేజి మీదకు రావడం చూసి ఉలిక్కిపడ్డా. ఆయనే హల్ధర్నాగ్ అనే ఒరియా కవి అని తెలిసింది. రాష్ట్రపతి భవన్ అవార్డు ఫంక్షన్ హాల్ బయట తచ్చాడుతున్న ఆయనను సెక్యూరిటీ అటకాయించబోతే వారిని వేదిక వద్దకు తీసుకువచ్చిన సిబ్బంది ఆయన కూడా పద్మశ్రీ గ్రహీతే అని చెప్పడంతో లోనికి పంపారట. హల్ధర్నాగ్ గారు ఒరిస్సాలో ఒక మారుమూల కుగ్రామంలో ఒక చిన్న పూరిగుడిసెలో జీవిస్తూ అక్కడి మిఠాయి దుకాణంలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. ఆయన తనకు వచ్చిన పదివేల రూపాయల పురస్కారాన్ని తమ గ్రామంలో ఉన్న అనాధ శరణాలయానికి విరాళంగా ఇచ్చేసారట.
ఆ తరువాత మరొక సంవత్సరం కాళ్ళకు చెప్పులు కూడాలేని కర్ణాటకకు చెందిన వందేళ్ళ వృద్ధురాలు తిమ్మక్క పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించడం, 120 ఏళ్ళ యోగాచార్యులు స్వామి శివానంద పద్మశ్రీ పురస్కారాన్ని తీసుకోవడం చూడగానే, కొమరం పులి సినిమా కోసం చంద్రబోస్ గారు రాసిన
‘‘నమ్మకమీయరా స్వామి
నిర్భయమీయరా స్వామి
సన్మార్గమేదో చూపరా
సుజ్ఞాన సూర్యుడిని మాలో వెలిగించరా
చెడుకెదురు పోరాడి
మంచినెపుడు కాపాడి
పిడుగు దేహమీయరా ప్రభూ
ప్రేమతో పాటు పౌరుషం, పంతం
తేజం, రాచగుణం ప్రభూ
వినయం విలువలనీయరా
లోన నిజము గుర్తించే
పైన భ్రమనుగమనించే
సూక్ష్మనేత్రమీయర’’ అన్న అర్థవంతమైన వ్యక్తిత్వవికాసం పాట గుర్తొచ్చింది.
చాలా కాలంగా పైరవీశ్రీలకు, (కాకా) పట్టు పరిశ్రామికులకే పద్మశ్రీలు రావడం చూసి చూసి విసిగిపోయి చొక్కాలేని కవిని, చెప్పులు లేని తిమ్మక్కను రాష్ట్రపతి భవన్లో చూసి ఆ తరువాత అదే వరుసలో మరికొంత మంది అతిసామాన్యులను సత్కరించడం మనదేశంలో నమ్మలేని నిజం. ఇటీవల కాలంలో పద్మశ్రీలు అందుకున్నవారిలో ఎక్కువమంది పద్మశ్రీ పదవి వొకటి ఉంటుందని కూడా బొత్తిగా తెలియని వారే! అటువంటి వారు పైరవీలు చేసే మాట దేముడెరుగు.
ఈ సంవత్సరం కూడా అంధులైన వేదపండితులు (గిరిధర్) రామభద్రాచార్యకు సాహిత్యంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం దక్కింది. వారి ప్రతిభకు మెచ్చి ఇందిరాగాంధీ వారిని కళ్ళ చికిత్సకోసం ప్రభుత్వ ఖర్చుతో అమెరికా పంపుతామంటే వారు సున్నితంగా తిరస్కరించి ` ‘‘దుర్గుణాలతో నిండిన, వివాదాలతో, మోసపూరితమైన దుష్టమానవుల పాపాలతో పరిపాలించబడుతున్న ఈ ప్రపంచంలో నేనేమి చూడాలి? పిల్లల రూపాన్ని కలిగిన రాముడు మాత్రమే విముక్తినిచ్చేవాడు’’ అని ఆమెకు లేఖ రాసారట.
అక్కడక్కడా ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చేవారితో కూడా బహువచనంలో సంభోదిస్తూ మర్యాదగా మాట్లాడే అరుదైన పోలీసు అధికారిని చూసినప్పుడు, పేషంట్ కళ్లల్లోకి చూస్తూ వారితో రెండు నిముషాల సేపైనా మాట్లాడే సెలబ్రటీ వైద్యులను చూసినప్పుడు, దళితుడి శవాన్ని మోయడానికి గ్రామంలో ఎవరూ ముందుకు రాకపోతే ఆ శవాన్ని భుజానికెత్తుకుని అంత్యక్రియలు చేసిన ఒరిస్సా ఎమ్మెల్యే గురించి విన్నప్పుడు, ఒక పేదవాడి ఇంటినిర్మాణానికి కూలీ అవతారమెత్తి రాళ్ళను మోసిన త్రిపుర మంత్రిని గురించి విన్నప్పుడు, తమ బూట్లు తామే తొడుక్కునే (పనివాళ్ళతో తొడిగించుకోకుండా) మంత్రులను చూసినప్పుడు, పనివాళ్ళ పట్ల కాస్త కరుణ చూపుతున్న యజమానులను చూసినప్పుడు, అవయవదాతల అంత్యక్రియలు గార్డ్ ఆఫ్ ఆనర్తో ప్రభుత్వ లాంఛనాలతో జరిపించి, వారి కటుంబానికి ఐదు లక్షల పారితోషికం ఇస్తున్న నవీన్ పట్నాయక్ వంటి ముఖ్యమంత్రుల్ని చూసినప్పుడు ఈ పాట చెవుల్లో గింగురుమంటూనే ఉంటుంది.
గత ఎలక్షన్ల తరువాత అదేపాట పదేపదే వెంటాడటంతో ఈ నాలుగు మాటలు రాయడం. ఆ పాట కొమరంపులి సినిమాలో పుట్టబోయే హీరో వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ‘రీల్’ కోసం రాసిన పాటే అయినా ‘రియల్ లైఫ్’ లో జనసేనానికి ఆ పాట చాలా బాగా నప్పేసింది. మోడీగారి పద్మశ్రీల ఎంపికకు, పవన్‌కళ్యాణ్‌గారి విజయానికి బహుశ: ఆ పాటే రోడ్ మ్యాపేమో. సామాన్యులూ పద్మశ్రీ సత్కారానికి యోగ్యులని మోడీగారి రుజువు చేస్తే, సామాన్యులూ రాజకీయాల దశ, దిశమార్చగలరని పవన్ గారి బాట, నమ్మకమీయర స్వామీ మరో సారి నా బోటివారి నమ్మకాన్ని రెట్టింపు చేసింది. చంద్రబోస్ గారు ఆ పాటను అంత అద్భుతంగా రాయడానికి హీరో గుణగణాలను పూర్తిగా ఆవాహనం చేసుకోవడం వల్లనే. ఆ గుణాలతో జనసేనాని నిజజీవితంలో మమేకం కావడం కాకతాళీయం కాదు చారిత్రక ఆవశ్యం, మరో అద్భుతం.
చిన్నతనంలో పేపర్‌బాయ్‌గా పనిచేసిన కలామ్‌గారు ఆదర్శవంతమైన రాష్ట్రపతి కావడం, ఒక చాయ్‌వాలా దేశప్రధాని అవ్వడం, వలస బానిస కుటుంబాల సంతతికి చెందిన నల్లజాతీయుడు బరాక్ ఒబామా రెండుసార్లు అమెరికా అధ్యక్షుడు కావడం వంటి ఊహకందనవి మనతరంలో ఎన్నో చూశాం. కలాంగారు తమ స్వీయ చరిత్రలో ‘‘నా జీవిత చరిత్ర రాయడం నా గొప్ప చాటుకోవడం కోసం కాదు. పేపర్‌బాయ్‌గా పనిచేసిన అతి సామాన్యుడు సైతం కృషి, ప్రయత్నంతో రాష్ట్రపతి కాగలగడం సాధ్యమే అని తరువాతి తరాల యువకులకు నమ్మకం, విశ్వాసం కలిగించడానికే మాత్రమే’’ అన్నారు. ఇవన్నీ కళ్ళెదుటే జరుగుతున్నా కొందరు ఇంకా బూజు పట్టిన రాయల్ బ్లూబ్లడ్ సిద్ధాంతాన్నే వల్లె వేస్తుండటం అవివేకం. ఎవరు ఏదైనా సాధించడానికి కావల్సింది బ్లడ్, బ్రీడు, పెడిగ్రీలు కావు, Brain and Brawn లు మాత్రమే. సాక్షాత్ ఎన్.టి.రామారావు గారే దానవీరశూర కర్ణలో ‘‘క్షాత్రమున్నవారందరూ క్షత్రియులే’’ అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇలాంటివి చూస్తూ బ్లూబ్లడ్ వాదులకు నమ్మకమీరస్వామి, సద్భుద్దినీయరా అనుకోవాల్సిందే.
ఎన్.టి.రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లో అధికారాన్ని అందుకోవడం దేశరాజకీయ చరిత్రలో సాటిలేని విప్లవాత్మక విజయం. ఒక్క మనదేశంలో మినహా మరే దేశంలోనూ (ఒక్క ఉత్తుత్తి రాజున్న ఇంగ్లండ్‌లో తప్ప) బ్లూబ్లడ్ సిద్ధాంతం, కనపడదు. అమెరికా ప్రెసిడెంట్లుగా రెండు టర్మ్‌లు చేసిన వారి సంతతి ఇప్పుడు ఏమిచేస్తున్నారో కూడా మనకు తెలియదు. ఒకప్పటి ఇంగ్లండ్ ప్రధాని మార్గరెట్ థాచర్ పిల్లలు, చాలా కాలం ఈజిప్ట్ ప్రెసిడెంట్ గా ఉన్న అన్వర్‌సాదత్ వారసులు ‘అజ్ఞాతవాసులు’ గా ఎవరి బతుకులు వారు బతుకుతున్నారు. మనదగ్గర ఒక్కసారి మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్‌గా చేసిన వారి పుత్రరత్నాలు యువకెరటాలై మనని ముంచెత్తుతున్నారు. వారి తల్లిదండ్రులకు “Son stroke” లు ఇవ్వడంతోపాటు మనకీ వడ దెబ్బలు సోకిస్తున్నారు.
130 కోట్ల జనాభా గల మన దేశం గత డెబ్బయి ఏళ్ళుగా యాభై కుటుంబాల పాలనలోనే కొనసాగుతోంది. లక్నోలో ఎవరినో ఒక అడ్రసుకు దారి అడిగితే – జవహార్లానెహ్రు రోడ్డెక్కి, రాజీవ్‌గాంధీ చౌక్ దాటి, ఇందిరానగర్ క్రాస్‌చేసి, మోతీలాల్ గంజ్‌కి పక్కనే సంజయ్‌గాంధీ హాస్పిటలుంటుందని చెప్పాడట. ఎంతో గొప్ప కుటుంబమైన ఇంత నామస్మరణం మరీ ఎబ్బెట్టుగా లేదు? ఇలాంటి వారసత్వపాలనకు వెరచి ధృతరాష్ట్రులు కాకూడదనేనేమో మోడీగారు, యోగి ఆదిత్య, జ్యోతిబసు, నవీన్ పట్నాయక్ వంటి దార్శనికులు బ్రహ్మచారులుగా ఉండిపోయారు. మనకి పెనుముప్పు తప్పించినందుకు మనం వారికి నమస్కరించి ఆజన్మాంతం రుణపడి ఉండాలి.
అబ్దుల్ కలామ్‌గారు స్వీయ చరిత్రలో “The Whole world gives way to the Person who knows where he is going” అన్నారు. చిత్తశుద్ధి సంకల్పబలం గలవారి విజయానికి ప్రకృతి శక్తులన్నీ సహకరించి తోడవుతాయట. పదేళ్ళ క్రితం పార్టీ స్థాపించిన పవన్‌కళ్యాణ్‌గారు ఓర్పుతో, ధృడ సంకల్పంతో ముందుకు సాగారు. ఎన్నో అవమానాలను, పరీక్షలను అనునిత్యం సహిస్తూ అక్రమాలపై పోరాటం సాగించారు.
సందర్భోచితంగా ఆయన ఇటీవల తీసుకున్న నిర్ణయాల్లో ఎంతో పరిణతి కనిపిస్తుంది. ఓడిన వారికంటె గెలిచిన వారికే ఎక్కువ సంయమనం అవసరం. అఖండ విజయం సాధించిన తరువాత కూడా వారు అదే నిగ్రహం కనబరిచారు. అందువల్లనేమో లక్షలాది అభిమానులు ఆయన వెంటనడిచారు. వారి చిత్తశుద్ధిని నమ్మి దేశ దేశాల నుండి వేలమంది లక్షల రూపాయిలు వెచ్చించి రాష్ట్రానికి వచ్చి ఓటేస్తారు.
తమ సంపాదనను ప్రజలకు పంచేవారు ఉత్తములు. ప్రజాధనాన్ని ఎంతో కొంత ప్రజలకిచ్చేవారు మధ్యములు. ప్రజల సొమ్మును తమ పేర్లుతో తామే ఇచ్చినట్లు వారికే ఇచ్చేవారు అధములు. మిగిలిన వారి సంగతి తెలియదు కానీ పవన్‌కళ్యాణ్‌గారు మొదటి కోవకు చెందిన వారనేది అందరూ చెప్పుకునే మాట.
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా విలువలను, తనవారిని, తన కుటుంబాన్ని మరువకూడదంటారు. పవన్‌కళ్యాణ్‌గారు వాళ్ళ అబ్బాయి అకిరాతో చంద్రబాబుగారికి, మోడీగారికి పాదాభివందనం చేయించడం పెద్దలపట్ల పిల్లలు మెలగాల్సిన తీరు, గౌరవం నేర్పడమే. తమ విజయానంతరం అన్నగారిని చూడటానికి వెళ్ళినప్పుడు అన్నగారికి, వదినగారికి, తల్లికి వినమ్రంగా వంగి పాదాభివందనం చేస్తున్న వీడియో చూడటం గొప్ప Feel Good అనుభవం. ఆ వీడియో చూస్తుంటే “A Happy Family is but an earlier Heaven” అన్న మాట మదిలో మెదిలింది.
వారి కుటుంబ ఐక్యత, ఆప్యాయతలు చూస్తున్నప్పుడు ఒన్స్మోర్ నమ్మకమీరా స్వామి పాట గుర్తురాక మానదు. ఎంతో శ్రమకోర్చి ఇంత అఖండ విజయం సాధించినందుకేనేమో మోడీగారు పుత్రవాత్సల్యంతో ఆయన సంస్కారాన్ని మెచ్చి పవన్ అంటే కేవలం పవనం కాదు పెనుతుఫాన్ ఆంధీ అని కితాబిచ్చారు.
Hidden agenda ఏ మాత్రం లేని ఒక రాజకీయవేత్తగా పవర్‌స్టార్ రూపాంతరం ఓవర్‌నైట్ మిరకల్ కాదు. తనను తను నిరంతరం మెరుగుపరుచుకుని, సంస్కరించుకోవడం వల్లనే అది సాధ్యం. ఓర్చుకున్నమ్మకు తేట నీరు అనేది వొట్టి సామెత కాదు, యదార్థం. Patience pays అనేది ఇంగ్లీషు వారి మాట. నేటి వారి విజయానికి ఆ ఓర్పే ప్రధాన కారణం.
అధికారంలో ఉన్నవారు కోటరీల్లో చిక్కుకుని హిపోక్రసీ, సైకోఫ్యాన్సీ, నార్సిజమ్ వంటి మాయల్లో పడి మేము దైవాంశ సంభూతులం కాము దైవాలమే అనుకుంటే ఎంతటివారికైనా time starts now. వందకోట్లు ఆస్తినిచ్చిన తల్లిదండ్రులను వారి పిల్లలు వృద్ధాశ్రమాలకు తోలడం చూసిన తరువాత కూడా మనమిచ్చే నాలుగైదు వేల రూపాయలకు (అది ప్రజల డబ్బే అని ఇచ్చేవాడికి తీసుకునేవాడికి బాగా తెలిసిపోయినప్పటికి) జీవితాంతం ఆ కుటుంబాలు తమ పట్లే విశ్వాసంగా ఉండాలన్న, ఉంటారన్న భ్రమలు తొలగితేనే సమాజానికి నిజమైన హితం. భవిష్యత్తులో ఈ ఉచిత పథకాలతో ప్రజలు సోమరులైపోతారేమో అని మంచి విజన్ వున్న నాయకుడు విచారిస్తుంటే కొత్తగా ఆలోచించే మేధావి అశాంతికిషోర్ ఇంటికో ట్రెడ్మిల్, ప్రతికుటుంబానికి నెలకో లీటర్ జెలూసిల్ ఫ్యామిలీ ప్యాకిస్తే పోలా అనే రోజులూ చూడాల్సొస్తుందేమో. కవి మిత్రుడు మోహన్‌రుషి అన్నట్లు ప్రజలు utopian సుపరిపాలన ఆశించడం లేదు కానీ ‘సుపారీ’ పాలన మాత్రం వద్దనుకుంటారు. అమెరికా ఎన్నికల్లో ఒక రాజకీయ సలహాదారు పోటీ అభ్యర్థులకు You Campaign in poetry. You govern in prose అని గొప్ప సలహా ఇచ్చాడట.
ఉన్నత పదవుల్లో పదవీ విరమణ పొంది జీవితాంతం ఏదో ఒక పదవిలో ఇంకా ఇంకా వ్రేలాడలని దేవులాడే వారున్నంత కాలం బడుగు జీవులు ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానన్నవారి వైపు మొగ్గుచూపటాన్ని అవిశ్వాసం అనడానికి, వారిని తప్పు పట్టడానికి మనం ఎవ్వరం సరిపోము. సర్వసంగ పరిత్యాగులు సైతం పదవులకోసం, జాగాల కోసం దిగజారిపోవడంతో పోల్చితే ఇది పెద్ద తప్పు కాదేమో. ఒకవేళ వారు చేసింది తప్పే అనుకున్నా అది పెద్ద గీతల పక్కన చాలా చిన్నగీతే. పెద్దల పెద్దపెద్ద దురాశతో పోలిస్తే ఇదేపాటి! కేవలం గరికపాటి.
చివరగా పవన్‌కళ్యాణ్ గారి పదేశ్ళ రాజకీయ ప్రస్థానం గమనిస్తే ఎప్పుడో మేము ఎమ్.ఎ.లో చదువుకున్న సాహిత్యనోబెల్ గ్రహీత రడ్యార్డ్ కిప్లింగ్ కవి రాసిన if కవిత స్ఫురణకొచ్చింది. కిప్లింగ్ స్కాట్లాండులోని అప్పటి రాజకీయవేత్త గౌరవార్థం రాసిన if కవితలోని …
‘‘జయాపజయాలు రెండిటినీ వంచకులనే సమదృష్టితో స్వీకరించగలిగితే’’ వాక్యాలు ఇంగ్లాండ్‌లోని వింబుల్డన్ సెంట్రల్ కోర్టు ఆటగాళ్ళ ప్రవేశద్వారంపై వ్రాయబడి ఉంటాయి. ఆటగాళ్ళు ఇటువంటి మానసిక సంసిద్ధతతో వింబుల్డన్ కోర్ట్లోకి అడుగుపెట్టమని నిర్వాహకుల హెచ్చరిక.
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్న అరిగిపోయిన మాట, పవన్‌కళ్యాణ్ గారి కృషికి చాలా చిన్నమాట. మన కవులు గొప్ప దార్శనికులు. ఆధునిక కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారిపై అభిమానంతో వారి ‘కవి మేనిఫెస్టో’ పదేపదే చదివి జనసేనాని తన మేనిఫెస్టోను రూపొందించుకున్నారు. యుగకర్త శ్రీశ్రీ కవి అంటే కష్టజీవికి అటు ఇటు ఉండి కాపలా కాసేవాడంటే, జనసేనాని అదే బాటలో పేదలకు సేవకుడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆధునిక కవి గురజాడ అప్పారావుగారు …
‘‘దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్ …
వట్టి మాటలు కట్టిపెట్టి
గట్టి మేలు తలపెట్టవోయ్’’ అని ప్రభోదించారు. దేశమంటే విషపుసారా అమ్మడం కాదోయ్. పేదల ‘సారో’ తగ్గించడమోయ్ అని కూడా అంటే బాగుండేది. ఎంతటి
యుగకర్త అయినా ఇంతటి ఘోర పరిణామాలను వారు నాడు ఊహించి ఉండరు.
వయసుకు మించిన స్థితప్రజ్ఞత, స్టాయిసిజమ్ అలవరచుకున్న పవన్‌గారిని చూసినప్పుడు రడ్యార్డ్ కిప్లింగ్ if కవిత లోని వాక్యాలే వారి వ్యక్తిత్వ ఆవిష్కరణకు తగినవి అనిపించింది. అంజనమ్మగారు యాభై ఆరేళ్ళ క్రితమే నమ్మకమీయరా పాటనే వేరే బాణీలో పాడుకునుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తూ …
(ఘనవిజయాన్ని సాధించిన జనసేనానికి, ఎంతో స్ఫూర్తినిచ్చే పాటనిచ్చిన చంద్రబోస్ గారికి అభినందనలతో…)
సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Seshendra: Visionary Poet of the Millennium
http://seshendrasharma.weebly.com/
జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా
మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు
తండ్రి సుబ్రహ్మణ్య శర్మ
తల్లి అమ్మాయమ్మ
భార్య / జానకి
పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
కవి విమర్శకుడు
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ…………… గుంటూరు శేషేంద్ర శర్మ కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు .
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)
“ఆధునిక తెలుగు కవిత్వానికి శేషేంద్ర అనే ఒక అభివ్యక్తి అలంకారాన్ని కానుక చేసి అద్వితీయ స్థానాన్ని పొందిన కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. భాషలో, భావంలో దృక్పథ ప్రకటనలో కవి కుండాల్సిన నైతిక ధైర్యం ఆయన రాసిన ప్రతిపాదంలోనూ కనిపిస్తుంది. కవి సామాజిక, సాంస్కృతిక నాయకుడై జాతిని నడపాలని భావించిన శేషేంద్ర కవిసేన పేరుతో ఒక మహా ఉద్యమాన్నే నడిపారు. సాహిత్య రంగంలో శేషేంద్ర ఎప్పుడూ ఒక సంచలనమే. సొరాబు నుంచి ఆయన ఆధునిక మహాభారతం దాకా గరీబు వెంట నడిచారు. ఆయన అభివ్యక్తి ప్రభావానికి లొంగని కవులు తెలుగులో అరుదుగా కనిపిస్తారు.
– పుస్తకం.నెట్
* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
– యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
———–
అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర
“గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.”
ఆచార్య పేర్వారం జగన్నాథం
సంపాదకుడు
అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు,
(ప్రచురణ 1987)
మాజీ వైస్ ఛాన్సలర్,
తెలుగు యూనివర్సిటీ)
Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com
బాగుంది హర్షా. ఏమయి పోయావ్. గ్యాప్ వచ్చింది
Mee analysis chaala goppaga vundhi Harsha Garu. The way you compared Pawanism starting with Chandrabose Komarampuli song and ending with Wimbledon central court entrance quote is marvellous. Mee Kadhanam loni content and padhajaalam chaala attractivega vunnai Harsha Garu. One thing everyone should agree Pawan has shown well maturity, patience and wisdom which made him successful politician.
సార్,
మంచి విషయాన్ని స్పష్టం గా చెప్పారు.ముఖ్యం గా “పద్మ” ల విషయం లో ఎలాంటి బేరాలు లేని పరిస్థితి పరిణితి చెందిన సమాజాన్ని సూచిస్తుంది.రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం ఒక మంచి మార్పు.ఈ పరిణితి ప్రక్రియకు సాహిత్యం,అంతర్గత విశ్లేషణ ప్రధాన భూమిక పోషించిందని భావన..
మరో మంచి వ్యాసానికై ఎదురు చూస్తూ…
జైశంకర శర్మ
కొమరం పులి లో పాటనే ప్రస్తుత పరిస్థితులకి పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానానికి విజయానికి మీరు చాలా చక్కగా సమన్వయపరిచి చాలా బాగా ఎనలైజ్ చేశారు .
అన్నింట్లోకి వింబుల్డన్ కోర్టు ముందు విజయాన్ని అపజయాన్ని ఎలా చూడాలో చెప్పిన లైన్లు చాలా బాగుంది.
పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యంగా ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొని స్థిరంగా పోరాడారు.
రాజకీయాలకి కొత్త భాష్యం చెప్పారు. అధికారం సేవ చేయడానికి మాత్రమే కానీ సేద తీరటానికి కాదు అని నిరూపించారు.
వారిని ఎప్పుడు చూసినా గుర్తుకు వచ్చిన శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలో
“నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గలం అనితర సాధ్యం నా మార్గం ”
అనే పదాలు నాకు గుర్తొస్తా ఉంటాయి.
హర్ష గారు ఈ భావాలన్నీ ఆలోచనలు అందరిలో ఉంటాయి కానీ వాటిని చక్కగా వ్యక్తీకరణ చేయటం మీరు ఆపోసన పట్టారు చాలా బాగుందండి చాలా చక్కగా చేశారు. అభినందనలు మీ బైరా దిలీప్ చక్రవర్తి.
From Writing an article: about appreciating the recognition of Padmasri awardees which depicts even simpler people can be recognised by the government; to linking it to a movie star who believes in simplicity transitioning to Deputy CM.
Great comparison sir.
Mee creativity ki Koti Vandanaalu👌
Mavayya, naaku baaga nachina vishayam meeru rasina danilo..gelichina vallu choopinchalsina vinamrata, very great learning through the lens of Pawan Kalyan. Thanks for putting this together.
Harsha Gari
వర్షించిన హర్షితాలు 🎇🌠🎇🌠
One full moon night’s cool breeze sir
జనసేనాని పవన్ గురించి మీ(మన) తరం వారు కూడా ఎంతోకొంత ఆశావాదాన్ని మిగుల్చు కొనుటకు ఆయన నడవడిక, పరిశ్రమ, పట్టుదల, సంస్కారం కారణమైతే…
మీ శైలిలో స్ఫూర్తినిచ్చే విశ్లేషణ చాలా హర్షనీయంగా ఉంది ఎప్పట్లాగానే!🙏🏻
ఒక గొప్ప సంపాదకీయం చదివినప్పుడు కలిగే ఆనందం, అనుభూతి కలిగాయి. ఉపమానాలను మించి ‘ఉదాహరణలు’ జాలువారాయి. విషయం ధాటిగా అర్థం కావడానికి తోడ్పడ్డాయి. అన్నిటికంటే మించి శైలి యొక్క ప్రవాహగతి ఆకర్షణీయం.
Superb sir.. Really inspirational lines.. Thank you🙏
Fantastic Harshvardhan Garu .The way you analysed the chatacter of Pavan Kalyan is Marvellous sir. You clearly visualised how Pavan Kalyan bounce back & reached his ultimate goal is highly appreciated.You clearly mentioned the people’s mandate is exemplary not giving any room to free schemes avoiding development of the state .
2019లో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితిని ఈనాటి పరిస్థితిని అంచనా వేస్తే అసలు పోలికే లేదు. కారణం ఒక రోజు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు వేదికపై ఎంపీ కాండేట్స్, ఎమ్మెల్యే కాండిడేట్స్ కూర్చుని ఉన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా వేదిక మీదకు వచ్చి ప్రజల చప్పట్లు మధ్య ఉపన్యాసం ఇచ్చేసి, కనీసం అభ్యర్థుల ముఖాలను కూడా పరిచయం చేయకుండా దిగి వెళ్లిపోయారు. నాటి ఎం.పి. అభ్యర్థి డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు ఆవేదన చెందారు.
ఒకరోజున అందరూ పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తుంటే మీరు ముందు నన్ను గెలిపించండి అంతేకానీ మీరు నన్ను సీఎం అన్నంత మాత్రాన, నేను సీఎం కాలేను అని వాళ్ళకి చెప్పారు. నిజానికి రెండు చోట్ల పోటీ చేసినప్పుడు ఒక్కచోట కూడా నెగ్గకపోవడానికి కారణం తన వల్లే అనే భావన కలగడం. ఆ తరువాత కాలంలో పరిణతి చెంది మానసిక ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. 2021 సం.లో సంవత్సరంలో మన నుడి మననది అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టారు. ఒకరోజు తెలుగు సాహిత్యానికి సంబంధించి సభ జరుగితే నేను అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రక్కన కూర్చున్న నాకు అప్పటికే చాలా పరిణతి వారిలో కనిపించింది. ఆ మధ్యాహ్నం గౌతమి గ్రంథాలయానికి వచ్చి చాలా నిశితంగా పరిశీలించారు.
వారి సామాజిక వర్గం వారు ఎంత రెచ్చగొట్టినా నిలువరించి 21 సీట్లనే తీసుకొని నెగ్గించగలిగారంటే నిజంగా ఆయన దార్శనికతకు నిదర్శనంగా చెప్పవచ్చు. అంతేకాదు ఇటీవల జరిగిన సభలలో వారి మాటలాడే తీరు అచ్చెరువు గొలిపింది. వారికి శుభాభినందనలు. తన వ్యాసంలో వారిని ఉట్టంగించినందుకు హర్ష హర్షవర్ధన్ గారిని అభినందిస్తున్నాను.