జిల్లా పరిషత్ స్కూల్ ఇచ్చాపురంలో ఏడో తరగతిలో ఉండగానేమో మా తెలుగ మాస్టారు సుఖదు:ఖాలు, ఆలుమగలు, కలిమిలేముల్లా జంటగా ఉన్న పదాల్ని ద్వంద సమాసాలు అని చెప్పారు. ఇప్పటి పిల్లల్ని ద్వంద సమాసం అంటే ఏమిటని అడిగితే ‘‘నువ్వు సరిగ్గా విని ఉండవు, అవి సమాసాలు కాదు ‘సమోసాలు’ అని వివరించి, అవి విజయవాడలో అయితే నవరంగ్ థియేటర్ క్యాంటిన్లో, హైదరాబాద్‌లో అయితే ఇరానీ కేఫ్‌లో దొరుకుతాయి, మంచిగుంటాయి. ఎప్పుడ తినిపిస్తావ”ని మనల్ని తినేస్తారు.
పైన చెప్పుకున్న ద్వంద సమాసాల ఫ్లోలో ‘జెలసీ జెలూసిల్’ అనేవి కూడా చేర్చాలనేదే నా వాదన. మాయాబజార్‌లో పింగళివారి ఘటోత్గజుడు ‘తసమదీయులు’, అని కొత్త ప్రయోగం చేసిన శిష్యులను మెచ్చి ‘‘ఎవరూ పుట్టించకుండా ఉంటే మాటలేలా పుడతాయి?’’ అని చిన్నమయ్యను మందలించి వాళ్ళకు రెండు వీరతాళ్ళేయించినట్లే.
ఎన్వీ, జెలసీ అనే ఆంగ్ల పదాలకు అసూయ, ఈర్ష్య, మాత్సర్యం అనేవి మన తెలుగులో సమానార్ధాలు. అవడానికి రెండు, మూడు అక్షరాలమాటే ఐనా అది పట్టిందంటే రెండు పూట్లా తిండిని సహింపచేయని, మూడు ఝాములైనా కునుకు పట్టనీయనంత సత్తా గలది. ఇది చాలదన్నట్లు దీనికి బోల్డు Shades కూడా (మన లేడీస్ బ్లౌజ్ మ్యాచింగ్ సెంటర్లో పచ్చలో ముదురాకు, లేతాకు, చిలకపచ్చ, మరో పది పచ్చల్లాగాన్న మాట). షేడ్లేకాదు అసూయలో రకాలు కూడా రెండు. మొదటిది సామూహికం, రెండోది వ్యక్తిగతం.
సామూహిక అసూయంటే లేనివాళ్ళకు కలిగిన వాళ్లందరి మీద కలిగేది. మనం అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళందరి మీద ఉండే అసూయ. మన కాలనీలో మనకు మార్నింగ్‌వాక్‌లో వాక్కు కలిపే ఏ కాంట్రాక్టరో, డాక్టరో వాళ్ళ మనవడి బర్త్‌డే ఫంక్షన్‌కు రమ్మని పిలిస్తే వెళతాము. అక్కడ ఘనంగా జరుగుతున్న పార్టీ చూసి వాళ్ళు పెట్టిన విందు ఆరగిస్తూ ప్రక్కవాడితో, ‘ఏముందండి అడ్డంగా సంపాదించారు. ఎంతైనా ఖర్చు చేస్తారు,’ అని ఆ వర్గం మొత్తం మీద వగవడమే గ్రూప్ జెలసీ.
వ్యక్తిగతం అంటే నాకంటే ముందు ప్రమోషనొచ్చిన వాడి మీదనో, నా వయస్సు కంటే పెద్దవాడైనా బట్టతల రాక, జుట్టునెరవని (నాకు పూర్తిగా మైదానం కావడంతో) వాడి పట్లనో కలిగేది. మనబంధువుల్లో ఎవరికైనా కాలం కలిసొచ్చి పైకెదిగితే వాళ్ళల్లో చిన్నలోపాలను గుర్తుచేసుకొని వాళ్ళను కించపరచడం మాత్సర్యంతోనే. మనం కాస్త నల్లగా ఉంటే తెల్లగా ఉన్నోళ్ళను చూసి మనలో ఉన్న ద్రావిడ DNA ప్రభావంతో (Blame it on genes) ఆ పిల్ల/ పిల్లోడు తెలుపన్న మాటేగాని నార్త్ ఇండియాలో దేవుళ్ళల్లా ముక్కు మొహం ఏకమై సున్నంకొట్టినట్లుంటారనేసి మనల్ని నల్లగా పుట్టించినందుకు ఏకంగా దేవుళ్ళని కూడా మన జెలసీకి పార్టీని చేసేస్తాం.
పైన చెప్పిన వాటికి సీజనల్ జెలసీలు, సిబ్లింగ్ జెలసీలు, సవతుల జెలసీలు, ప్రొఫెషనల్ జెలసీలు అదనం. ఎలక్షన్లు అయి ఓడిపోయిన నాయకులు ‘‘మా తప్పిదాలను సరిదిద్దుకుంటాం, ప్రజా తీర్పును గౌరవిస్తాం’’ (ప్రస్తుతానికి అంతకంటే చేసేదేమీ లేదు కనుక) అంటూనే, ‘మద్యం, డబ్బు, అధికార దుర్వినియోగం’, వల్లనే వారు గెలిచారని ముక్తాయిస్తారు. సివిల్స్, ఎమ్‌సెట్ రిజల్ట్స్ వచ్చిన సీజన్లో ర్యాంకులు రానివాళ్ళు’‘‘వాడు నా Notes లు కాపీ కొట్టేవాడనో, ఎప్పుడూ క్లాసులో వెనక బెంచిలో కూర్చుని నోరు మెదిపే వాళ్ళేకాదనో” ర్యాంకులొచ్చిన సహచరులపై వ్యాఖ్యానించడం సీజన్స్ గ్రీటింగ్సే!
మన ఇతిహాసాలైన రామాయణ, భారతాలు అసూయపై ఎంతైనా రీసెర్చ్‌కు అనువైన క్లాసిక్స్. కైకేయి అసూయ సీతారాముల వనవాసానికి, సీతాపహరణానికి, రావణ సంహారానికి మూలమైంది. రారాజుగా సకలభోగాలు అనుభవిస్తూ కేవలం భీముని పట్ల సిబ్లింగ్ జెలసీతో కాగిపోయిన దుర్యోధనుడు ఐదుగురికి ఐదూళ్ళు కాదు కదా, సూది మోపినంత భూమినైనా పాండవులకు ఇవ్వనని తెగేసి చెప్పేసి కురుక్షేత్ర యుద్ధానికి తెరలేపేసి, మాత్సర్య మహిమతో మడుగులో దాగవలసిన అగత్యం తెచ్చుకున్నాడు. మానధనుడైన దుర్యోధనుడికి రాజ్యకాంక్ష కంటే మాత్సర్య గుణమే ఎక్కువ. గురుచరణ్ దాస్‌గారు రాసిన ‘Difficulty of Being good’ అనే పుస్తకంలో ఈ అసూయా స్వభావం మీద అద్భుతమైన విశ్లేషణ చేసి అదొక మానసిక రుగ్మతగా తేల్చేశారు. వారి దృష్టిలో భారతంలోని పాత్రలు వ్యక్తుల స్వభావాలకు ప్రతిరూపాలే అని, ధర్మరాజు ధర్మానికి ప్రతిరూపమైతే, దుర్యోధనుడు అసూయకు ప్రతిరూపమని వ్యాఖ్యానించారు. కేవలం ఇటువంటి సిబ్లింగ్ జెలసీతోనే గురజాడ వారి కన్యాశుల్కంలో రామప్ప పంతులు గిరీశంకు మధురవాణితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఓర్వలేక ఈ గిరీశం ఎమంత గొప్పోడేమీకాదు మా లుబ్ధావధాన్ల పినతల్లి కొడుకు. వీడిని మేము చిన్నప్పుడు ‘‘గిర్రాయ్, గిరిగా, ఓరేయ్ గిరీ’’ అని పిలిచే వాళ్ళమని అక్కసు వెళ్ళగక్కుతాడు. ఆ తరువాత గిరీశం ఎంట్రీతో మంచం కింద నక్కుతాడు.
కథల్లోనే కాక నిజ జీవితంలోనూ ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంతో భవిష్యత్తున్న ప్రమోద్ మహాజన్ చిన్నపాటి సిబ్లింగ్ జెలసీకి బలైపోవడంతోపాటు అంబానీ సోదరులు, అళగిరి, స్టాలిన్లు సిబ్లింగ్ జెలసీకి కేస్ స్టడీస్. ప్రమోద్ మహాజనే ఉండి ఉంటే మన వెయ్యినోట్లు, ఐదొందల నోట్లు రద్దవ్వక ముద్దుగా మన వద్దనే ఉండేవి కదా, మనకు ఎన్నో బాధలు తప్పేవి. ఆ మాటకొస్తే ప్రస్తుత సినీ, రాజకీయ రంగాల్లో వున్న ప్రముఖ సిబ్లింగ్సే మన జెలూసిల్‌కు మహారాజ పోషకులు, జీవిత చందాదారులు.
సిబ్లింగ్ జెలసీకి ఏమాత్రం తీసిపోనిది సవతుల జెలసీ. భారతంలో కశ్యపుని భార్యలైన వినత, కద్రువలు గుర్రం రంగుమీద బెట్టింగ్ (మన హార్స్‌రేస్‌ల బెట్టింగ్స్‌కు బీజం) చేసుకుని కర్కోటకుడితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని కద్రువ గెలిచేసినా జెలసీ కారణంగా కద్రువ సంతానమైన సర్పాలు జీవితాంతం గరుత్మంతుడికి భయపడుతూ బతుకుతున్నాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో, గర్వంతో సత్యభామ రుక్మిణీ దేవిపై ఉన్న మాత్సర్యంతో నారదుల వారినే Action Agent చేసి పతిదేవుడైన సాక్షాత్ శ్రీకృష్ణుడినే For Sale కి పెట్టేసి భంగపడి కేవలం తులసిదళంతో రుక్మిణి ముందే అవమానం పాలైయింది.
ప్రొఫెషనల్ జెలసీ సర్వాంతర్యామి. బడి, గుడి, ఆఫీసు ఏదైనా ఇది హాజరే. రాయల వారి కొలువులో అష్టదిగ్గజాల మధ్య ప్రొఫెషనల్ జెలసీల కథనాలు మనం చాలానే విన్నాం. భర్తృహరి మహాకవి మాత్సర్యాన్ని గూర్చి ‘‘బోద్దారో మత్సరగ్రస్థాం’’, పండితుల మాత్సర్యం లేక అసూయాగ్రస్తులై ఉంటారని చెప్పారు. పదకవితా పితామహుడు అన్నమయ్య సైతం కడుపెంతతా కుడుపు అనే కీర్తనలో
‘‘పరుల మనసుకు ఆపదలు కలిగించు
పరితాపకరమైన బ్రతుకేల’’
అంటూనే …
‘‘సొరిగి ఇతరుల మేలు చూసి సైపగలేక
తిరుగుచుండే కష్టదేహమదియేల’’
అని ఆసూయాపరులకు ఓర్వలేనితనం మిగిల్చేది కష్టదేహమే అని తేల్చారు.
తలపండిన ఆచార్యులుండే విశ్వవిద్యాలయాల్లో, కేంద్రసాహిత్య అకాడమీల్లో భర్తృహరి చెప్పిన మాటే నడుస్తుంటుందని వింటుంటాం. షేక్‌స్పియర్ Othello నాటకం జెలసీ అంతస్సూత్రంగా నడుస్తుంది. అందులో Iagio పాత్రతో పలికించిన మాటలు నేటికీ ప్రాచుర్యం కోల్పోలేదు.
మేము పనిచేసేటప్పుడు మా కొలీగ్ మిత్రుడుండేవాడు. ఆయన గదిలో పేపర్ వెయిట్ల స్థానంలో రెండు, మూడు జెలూసిల్ సీసాలుండేవి. వాటిని తరచూ అక్కడ చూస్తూ ఒకరోజు వారి అటెండర్‌ను ‘సార్ ఆరోగ్యం బాగోడం లేదా?’ అని అడిగా. స్వామిభక్త (భయ) పరాయణడైన అతగాడు, ‘‘అవున్సార్ వారం వారం నేనే హోల్ సేల్ రేట్లో జంబో/ఫ్యామిలీ pack తీసుకొచ్చి టేబుల్ మీదున్న బాటిల్స్‌ను ఆరంగారంగా రీఫిల్ చేస్తున్నా, వారి ఆరోగ్యం ఏమైపోతుందో’’, అని కళ్ళు వొత్తుకున్నాడు. సదరు కొలీగ్ మిత్రుడు ఎవరికి మంచి పోస్టింగొచ్చినా, ఎవరికైనా ఏదైనా చిన్నమంచి జరిగినా ఒక మాటనేసి కడుపు నిమురుకుంటూ గబగబా గదిలోకెళ్ళి సీసా ఎత్తుకుని గటగటా జెలూసిల్ ఎందుకు తాగేస్తున్నాడో కార్యకారణ సంబంధం ఎరుకపడింది. ఇదే అంశతో ఉన్న పై అధికారి ఒకరు ఉండేవారు. అధికారుల రివ్యూ మీటింగుల్లో ఎవరైనా క్రిందస్థాయి అధికారి కాస్త తెల్లచొక్కా వేసుకునో, మంచి వాచీతో కనిపిస్తే, వారు రివ్యూ పక్కనపెట్టి ముఖం వాచేలా వారిని వాయించేసేవారు. ‘చొక్కాలేసుకోగానే సరిపోదు పనిచేయాలి’, అనేవారు.
జీరో అయిపోయిన హీరో
మన సినిమాల్లో సైతం జెలసీకి పెద్ద నేపథ్యమే ఉంది. ప్రపంచ ప్రఖ్యాత జర్మన్ సంగీత విద్వాంసుడు మొజార్ట్ biopic గా తీసిన Amadeus సినిమా జెలసీ ఇతివృత్తమే ప్రధానాంశం. ఈ సినిమాకు ఎనిమిది ఆస్కార్ అవార్డులు రావడం విశేషం. మన తెలుగులో ఇదే కథాంశంతో కె.విశ్వనాథ్‌గారి స్వాతికిరణం నడుస్తుంది. గొప్ప సంగీత విద్వాంసుడు ఒక బాలుని గాన ప్రతిభకు ఓర్వలేక అతని ఆత్మహత్యకు కారణమై తన విద్వత్తునంతా కోల్పోయి పిచ్చివాడై మళ్ళీ మొదలుకు రావడం ఈ సినిమా ఇతివృత్తం. క్లైమాక్స్‌లో ఒక పండితునితో ‘‘అనంతరామశర్మగారు సప్తస్వరాలను వశం చేసుకున్నారు. అరిషడ్వర్గాలకు లొంగి పోయారు’’ అని బోధ చేయించి, మాత్సర్యాన్ని వీడి, దేహమే దేవాలయంగా జీవించండి అని స్వస్తి పలికించారు.
ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు సత్యజిత్‌రే యాభై ఏళ్ళక్రితమే కేవలం పన్నెడు నిముషాల నిడివితో `Two` అనే సినిమా (YouTube లో కలదు) తీశారు. ఒక్క మాట లేకుండా కేవలం ఇద్దరు పిల్లల పాత్రల్తో ఈ సినిమాలో పదేళ్ళ పసివాడు జెలసీతో తుపాకీ చేతబట్టి సాటి పిల్లవాడి సంతోషాన్ని ఎలా భగ్నం చేశాడో హృద్యంగా చిత్రీకరించారు.
మనం ఎన్ని భాషణలు విన్నా భాష్యాలు చెప్పుకున్నా జెలసీ ఎవరినీ వదిలేది కాదు. ఎలాగైతే డిప్రెషన్ అనేది ప్రతివొక్కరినీ ఏదో ఒక వయస్సులో ఏదో ఒక సమయంలో ఆవహించి ఉంటుందో జెలసీ అనేదీ మనందరికీ ఎంతో కొంత మోతాదులో ఉండనే ఉంటుంది. ఎటొచ్చి షుగర్ వ్యాధిలో బోర్డర్ లైన్ కేసు అనగానే మనం జాగ్రత్త పడవలసినట్లు, డిప్రెషన్, జెలసీలు బోర్డర్ లైన్స్ దగ్గర గుర్తిస్తే మనం వ్యాధి వైపు జారిపోము.
ధర్మాగ్రహం లాగానే ఆరోగ్యకరమైన అసూయ (Healthy Jealousy) అనేది మంచిదే. మొదటిసారి ప్రముఖ రచయిత సంజీవదేవ్ గారిని తుమ్మపూడిలో వారి ఇంటిలో చూసినప్పుడు నాకు ఆరోగ్యకరమైన అసూయ కలిగింది. సంజీవదేవ్‌గారు గొప్ప భావకులు, నిర్మలచిత్తులు. వారి ఇల్లు పచ్చని వరిపొలాల మధ్య విశాలమైన ప్రాంగణంలో గిజిగాళ్ళ గూడులతో పలురకాల పూలమొక్కల మధ్యనుంది. ఇంటిలోపల పైఅంతస్థులో మంచి లైబ్రరీ. బయట బాల్కనీలో చల్లటి పైరుగాలుల్లో తూగుటుయ్యాల. అక్కడ నుండి చూస్తే దూరంగా పంటకాలువ, బంగారురంగు వరిచేలు, సూర్యాస్తమయం. అదనంగా పైన కూర్చున్న అతిథులకు అల్పాహారాలు, తేనీటి సేవలు. ఇవన్నీ చూసి ఎవరికి కలగదండి Healthy అసూయ.
ఇటీవల మా పెద్ద వియ్యంకుడు పి.వి.రావును చూసినప్పుడు సత్యహరిశ్చంద్ర నాటకంలో పద్యాలకు Once more కొట్టినట్లు మరోసారి ఆరోగ్యకర అసూయ తాకింది. ఆయన శ్రమ పడవలసిన వయస్సులో శ్రమపడి పిల్లల్నిద్దర్నీ స్థిరపరిచి (కొంతలో కొంత బాల్యవివాహం కూడా కలిసిరావడంతో) ఉన్నంతలో చాలనుకుని, తృప్తి చెంది పెద్ద ఎజెండా, షెడ్యూల్స్ లేకుండా ఏ ఆరాటాలకు లోనుకాకుండా చిన్న వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు పెంచుకుంటూ, సైకిల్ తొక్కుకుంటూ, ఈత కొట్టుకుంటూ ‘తాపీగా’ గడిపేస్తుంటారు. ఇవన్నీ చూసీ ఆరోగ్యకరమైన అసూయ కలగకపోతే మన ఆరోగ్యం బాగాలేనట్లే. దీనిని ఈర్ష్య అనకుండా ‘ఆదర్శంగా గ్రహించడం’ అనవచ్చు.
జెలసీకి రెండో వైపుకూడా ఉంది. బాలయ్య బాబు ఒక వైపే చూడు రెండో వైపు చూడకు అన్నట్లు కాదు మరి. ఎదుటివారి ఎదుగుదల మన బలం అనుకన్నామనుకోండి, మనకు మన వ్యాధికి విరుగుడు దొరికేసినట్లే. మా మేనత్తగారి అబ్బాయి విజయ్‌కుమార్ (విజ్జి) ఇంజనీరింగ్ పూర్తి అయిన తరువాత కొన్ని వొడిదుడుకులు పడి అమెరికా చేరుకుని బాగా స్థిరపడ్డాడు. మేము తొలిసారి అమెరికా వెళ్ళినప్పుడు వాడు కొనుక్కున్న ‘బెంజి’ కారులో తిప్పాడు. ఆ కారులోకి ఎక్కుతూ (మా face కు ambassador లే లేవు) ‘‘ఒరేయ్ విజ్జీ జీవితంలో మొదటి సారి బెంజి కారెక్కుతున్నందుకు ఆనందం, అది నీ కారు అవ్వడం రెట్టింపు ఆనందం’’ అని చెప్పా. నేను వాడితో ఈ మాటలు చెప్పే సమయంలో ఆ రోజున మేము న్యూజెర్సీలో దాటుతున్న బ్రిడ్జి మీద తను ఎప్పుడు వెళ్ళినా నా మాటే పదేపదే గుర్తొస్తుందని వాడు నాతో చెప్తుంటాడు. మా వాడి ఎదుగుదలే నాకు బెంజి వాహనయోగం కలిగించింది కదా మరి. (Recap చేసి చూసుకుంటే ఆ వారం నా వారఫలాల్లో పడవంత వాహన యోగం అని కూడా ఉంది).
మేము మొదటెక్కిన మా విజ్జి బెంజి
గతంలో మా డిపార్ట్‌మెంట్లో ACTOలుగా పనిచేసి కృషి, పట్టుదలతో ఐ.ఎ.ఎస్ కు ఎంపికైన శివశంకర్ (ఆంధ్రప్రదేశ్), శిబిచక్రవర్తి (మేఘాలయ) లను ఈ మధ్య విజయవాడలో, షిల్లాంగులో కలిశాను. వాళ్ళిద్దరూ ప్రజాసేవలో మంచిపేరు తెచ్చుకుంటున్నారు. కోవిడ్ కష్టకాలంలో శివశంకర్ ఎంతో మంది మిత్రులకు ఆపద్భాందవునిగా నిలిచాడు. వారిద్దరూ ఎంతో ఆప్యాయంతో మమ్ములను అభిమానించి ఆదరించారు. మన చుట్టూ ఉన్నవాళ్లు ఎదిగితే అది మనకూ బలమే. మనకంటే చిన్న వాళ్ళు, మన చట్టూ ఉన్నవాళ్ళు ఎదిగితే మన గుండె నిండాలే కానీ మండకూడదు. మనవాళ్ళు ఎదిగితే మనం సంతోషించి, అభినందించాలే కాని దిగులుతో మంచమెక్కరాదు. అలా ఎక్కకుంటే వాళ్లు మనకు కాఫీలిచ్చి, కార్లెక్కిస్తారు. ఇలాంటి మంచి ఆలోచనావిధానంతో మనకు జెలూసిల్ అవసరం పడదు. లేదు మేము ఇలాగే బతికేస్తాం అని మొండికేస్తే ‘అతడు’ సినిమాలో చూపించినట్లు రివర్సులో పేలే తుపాకీ పేల్చుకుని హరాకిరి చేసుకుని పోతాం.
ఇవన్నీ మీకు ఏకరువు పెట్టడం జెలూసిల్ సేల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ కావాలన్న ఆరాటంతో కాదు. మనల్ని జెలూసిల్ నుండి ఎంతో కొంత కాపాడుకోవాలనే తపనతోనే! అర్థం చేసుకోరూ….
అద్భతంగా ఉంది సార్!
ఎన్నో ఎన్నెన్నో విదాలుగా మనుష్యులలో ఉండే ఈర్ష్య ద్వేషాలను, వాటివల్ల కలగే చెడు
పలితాలకు ఎలా దూరంగా ఉండాల్సిన అవసరం గురించి హాస్య రస భరితంగా
మాకందించినందుకు కృతజ్ఞతలు.
🙏🏻🙏🏻
Beyond words Sir,
From Tretha yugam to Otello, Swathikiranam to office ..all in one frame.
Difficulty of being good book by Ramachandra Guha..thought provoking.
Excellent narrative.Seeing happiness in others success is the key tonic to good health and prosperity. Being untouched by jealousy is an art which you have followed and inspiring the younger generation.We in the department have learnt and still learning lessons about professional jealously. Laughing away to the the thoughts cropped in some minds who are always watching others and commenting .
It’s like raining words.
Great article Sir.
ఈర్ష్య అసూయ; రాగం ద్వేషం; మదం మాత్సర్యం; కుళ్ళు కుత్సితము;కోపోద్రిక్తతలు; దురాశ అత్యాశ ద్వంద్వ సమాసాలలో నెగటివ్ టింజ్ గల దుర్గుణ పదములు. కొందరిలో ఇవి అన్నీ కలిపి ఉంటాయి. అటువంటి వారికి కడుపులో జ్యూసెస్ సెక్రెట్ అయి వారికీ జెలుసిల్ అవసరం చాలా ఉంటుంది. వీటిని వార్ణిస్తూ వాటి దుషఫలితాలు (పురాణాలలో మరియు చరిత్రలో జరిగినవి) సోదాహరణగా చాలా చక్కగా వివరించి నారు. అలాగే ఆరోగ్యాకర స్పర్ధ నూ బహు బాగా వర్ణించారు. మీ మాటలే బాగుంటాయి అటువంటప్పుడు మీ వ్రాతలు ఎందుకు బాగోవు. Thanks for giving an us an opportunity to read and enjoy your scripts. Hats off to you, sir. 🙏👍
ఈర్ష్య అసూయ; రాగం ద్వేషం; మదం మాత్సర్యం; కుళ్ళు కుత్సితము;కోపోద్రిక్తతలు; దురాశ అత్యాశ ద్వంద్వ సమాసాలలో నెగటివ్ టింజ్ గల పదములు. ఇ కొందరిలో ఇవి అన్నీ కలిపి ఉంటాయి. అటువంటి వారికి కడుపులో జ్యూసెస్ సెక్రెట్ అయి వారికీ జెలుసిల్ అవసరం చాలా ఉంటుంది. వీటిని వార్ణిస్తూ వాటి దుషఫలితాలు (పురాణాలలో మరియు చరిత్రలో జరిగినవి) సోదాహరణగా చాలా చక్కగా వివరించి నారు. అలాగే ఆరోగ్యాకర స్పర్ధ నూ బహు బాగా వర్ణించారు. మీ మాటలే బాగుంటాయి అటువంటప్పుడు మీ వ్రాతలు ఎందుకు బాగోవు. Thanks for giving an us an opportunity to read and enjoy your scripts. Hats off to you, sir. 🙏👍
very indepth description of jealousy and how it takes on life.
Swathikiranam is the classic movie
came on this subject.
last punch lines on how Antharaysharma failed to over come
Arishadvargalu is very very profound
Many of the contexts you mentioned in the topic is some where or other we experienced.
excellent is small word and its like a personality development subject.
keep going sir.
verywell dealt the subject.
Best wishes.
Dilip.c.Byra
Hilarous description about jealousy Sir..messge oriented plus commercial aspects teese few successful cinema directors la..meeru issues touch chestu manchi message kuda estunnaru… ఒకరి కష్టం,శ్రమ,ప్రాప్తం వల్లనే ఒక్కొక్కరికి ఒక్కటి జీవితం లో లభిస్తాయి..ఒకరు మీద అసూయ పడడం వల్ల వాళ్ళకి అది దూరం కాదు,మనకి అది dakkadu అని అర్థం చేసుకుంటే gelusil తో అవసరమే ఉండదు…
రాముని రోజులనుంచి ఈ రోజుల వరకు all shades of అసూయని అదంగా అమర్చారు అన్నయ్యా !
తన అసూయే తన శత్రువని చెప్పకనే చెప్పారు.
Proud of you అన్నయ్యా 🙏🏼
మహాద్బతంగా చెప్పారు సార్ 👌🏻
Okka page lo intha knowldge, experieces, analysation…. alaa elaa sadhyam anna???
Thats why you are adored by every body. Great anna.🙏🙏.
Maku oka telugu proverb gurtukostundhi…telisindhi gorantha tulusukovalsindho kondantha.
We are getting cute jelous by seeing you : 😄😄
ఎందుకె రాధా ఈసునసూయలు మిస్సమ్మను వదిలేసారే. స్థలాభావమేమో.
పాఠశాల మిత్రులను ఎన్నో ఏళ్లకు కలిసినపుడు జామకాయల దొంగతనాల గుర్తులతో గోలగా నవ్వినట్లే వుంటాయీ ముచ్చట్లు!
స్పర్ధ ముద్దు. అసూయ వద్దు అని చెప్పిన తీరు అసాధారణం. ఎవరైనా ఇది చదివి పెదవి విరిచారో వారికి జెలూసిల్ తప్పనిసరి.
హా హా.
జెలసీ పై అన్నీ రిఫరెన్స్ లు వచ్చేసినట్లున్నాయి. మీ జెలుసిల్ సారు కి అల్సర్ వచ్చేసి వుంటుందేమో. మీ ఇంకో సారు గురించి కూడా చెప్పావు. ఇప్పుడు ఎక్కువ మంది అలాటి వాళ్ళే వున్నారు. చంపేస్తున్నారు. వీళ్ళ జెలసి, ఇగో ల తో చస్తున్నాం. రాజకీయ నాయకులు, ముఖ్య మంత్రులు ఇలాటి వెధవలు వచ్చి అందర్నీ ఇబ్బంది పెడుతున్నారు.
మామూలు జనాల్లో కూడా జెలసి ఎక్కువై హత్య లు కూడా జరుగుతున్నాయి. మొదల్లో రాసినట్లు ఎవర్ని వారిని తుప్పు లాగా దహిస్తున్నది.
Anna jalusal is very danger which creates sleepless nights…and as you said..we need to happy if known people are in good position some day they will help….
So no jalusal……
Superrrrr…..Sir
అసలు మీకు సరికొత్తఐడియాలు ఎలావస్తాయండి బాబు😂😂😂
అవును నాకు అనుమానం వస్తోంది ఆ మహాకాళీ తల్లి కాళిదాసునాలుకమీదవ్రాసినట్టుమీ నాలుకమీద కూడా వ్రాసేసి ఉంటుందేమోనని లేకపోతే ఎక్కడినుంచి ఎక్కడికెళ్ళారు. శ్రీ శ్రీ మహాశయుడు ‘ కుక్కపిల్ల అగ్గిపుల్ల ….కాదేదీ కవితకనర్హం’ అన్నట్టు మీకేదైనా రచనా వస్తువేకదా🙏🏼🙏🏼🙏🏼ఏంచెప్పారు రామప్పపంతులుకు గిరీశంమీద ఈర్ష్య, సత్యభామకు రుక్మిణీదేవి మీద అసూయ కార్యాలయాల్లో క్రింది అధికార్లమీద పైఅధికారుల అసూయ మళ్ళీ అందులో ఆరోగ్యకరమైన అసూయ -మీ పెద్ద వియ్యంకుడిగాను మీద మీ అసూయలా- నాకు కూడా మీద అసూయ ఉందండోయ్ అదేమి అసూయో మీరే చెప్పాలిమరి
శుభాభినందల ఆనందమాలాభివందనలతో—-చలం
సార్!జెలసీ కి జెలస్ లెస్ దిల్లే జెలూసిల్
Very nicely articulated 👏🏻👏🏻👏🏻
Dear Babai, indeed thought provoking. Wonderful message to this generation and also for parenting. The analogies are excellently drawn to reflect contemporary realities. 👏👏👏🙏🏼
సర్,
చాలా నిజమైన,సామాజిక జీవనంలో చాలా సాధారణంగా చుట్టూ కనపడే “జెలసీ” గురించి ఎంతో చక్కగా రాశారు.
జెలసీ గురించి చాలా బాగా చెప్పారు హర్షవర్ధన్ గారు. అన్ని రంగాల్లో ఉన్న జెలసీ ని చాలా చక్కగా వివరించారు. హర్ష వర్ధన్ గారి జుట్టు ను చూస్తే నాకు కూడా జెలసీనే. జెలుసిల్ తీసుకొనేంత కాదు లే
Nice explanation in all aspects at every stage and I like somosa one
ఎన్ని విషయాలు స్పృశించారు హర్షవర్ధన్ గారూ! ఆలోచనా
అమృతం పంచారు. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి….అన్నట్టు ముగించారు.
Jealisiously humourous.
మన చుట్టూ ఉన్నవాళ్లు ఎదిగితే అది మనకూ బలమే.. aney maata Adirindi Sir _/\__/\_
Chaala Baaga chepparu.
మీరింత బాగా వ్రాసేస్తున్నందుకు అసూయగా ఉన్నా నా పరిచయస్తులైనందుకు ఆనందంగా ఉంది😃
మీరింత బాగా వ్రాసేస్తున్నందుకు అసూయగా ఉన్నా నా పరిచయస్తులైనందుకు ఆనందంగా ఉంది😃
ఇంక జెలుసిల్ అక్కర్లేదు!
Excellent sir
Touched all the aspects right from puranas to cinemas and also office administration.
Hats off sir
Good text. If humans win overenvy or jealous, it is almost possible to win the world