గడిచిన ఆదివారం సాయంత్రం ప్రస్తుతం మేము ఉంటున్న లారెన్స్ అనే ఊళ్ళో మా చిన్నబ్బాయి తేజ పుట్టినరోజున Downtown లో ఉన్న Restaurant కు వెళ్ళాము. Downtown అంటే మన భాషలో పాత నగరమే. అందుకని అమెరికాలో ఏవూరి Downtown అయినా మన అబిడ్స్, కోటి వంటిదే. డిన్నర్ ముగించుకుని బయటకొచ్చి side walk మీద నడుస్తూ పార్కింగ్ చేసి ఉన్న కార్లను దాటి వస్తున్న నన్ను అక్కడ చెట్టుక్రింద పార్క్‌చేసి ఉన్న వ్యాన్ ప్రక్కన అట్టముక్కపై రాసి వున్న ‘Anything Helps! (Even a smile)’ ఒకే ఒక్క వాక్యం నన్ను కట్టిపడేసి సాహిత్య దర్పణంలో విశ్వనాధుని ‘‘వాక్యం రసాత్మకం కావ్యం’’ అన్న మాటల్ని గుర్తుచేసింది. రసాత్మకమైన ఒక్క వాక్యమైన ఎన్నో పేజీల కావ్యానికి సమానమైనదే అనే మాట నేను చదివిన పై వాక్యానికి సరిగ్గా సరిపోతుంది.
అమెరికా సంపన్న దేశమైనా ఎంతో మంది Homeless కూడా ఉంటారు. కొందరు ఇక్కడ ఇళ్ళు కొనే స్థోమతు లేక వ్యానుల్లో, కార్లలో బతికేస్తుంటారు. అలా ఒక వ్యానులో బతుకుతున్న ఒక కుటుంబం పెట్టిన బోర్డే పైన మేము చూసింది. అంత పేదరికంలో ఉన్నా వారు ఏమీ ఇవ్వని వాళ్ళకూ Thank you చెప్పేసి మీరు ఏమీ ఇవ్వకపోయినా ఫర్వాలేదు. మీ చిన్న చిరునవ్వైనా మాకు సాయంచేసినట్లే అనడం వారి ఉత్తమ సంస్కారాన్ని తెలియజేస్తోంది. అటువంటి నిస్సహాయుల్ని చూసి ముడుచుకుని, ముఖం తిప్పేసుకోకూడదన్న పెద్ద పాఠం ఈ చిన్న వాక్యానికి కావ్య స్థాయి కల్పించింది. Smile is the shortest distance between two people అంటారు.
ఒక బిచ్చగాడు సెంటర్లో ఎవరినో బిచ్చమడిగితే అతను “Sorry Brother I don’t have anything to give” అని బాధపడతాడు. బిచ్చగాడు It’s Ok, thank you అని అంటే అతను నేను నీకు ఏమీ ఇవ్వలేదు కదా Thanks ఎందుకు చెప్పావంటే బిచ్చగాడు “You have already helped me by calling me your brother. That is enough. I am glad and thankful”, అని బదులిస్తాడు. ఈ చిన్న సంభాషణ Courtesy Costs nothing but matter a lot అని తెలుసుకోడానికే.
సరిగ్గా అంతకు ముందు ఆదివారం Down town కి వెళ్ళినప్పుడు దిమ్మతిరిగేలా ….
అని ఒక అట్టముక్క మీద రాసిపట్టుకున్న బట్టలు చిరిగి, గడ్డం పెరిగిన ఒక అభాగ్యుడు కనిపించాడు. సదరు అభాగ్యుని లాయరు, భార్యల మేలు కలయికే మనవాడిని గుడ్డ పరిపించేసి, రోడ్డున పడేసిందని ఏక వాక్యకంగా విశదమయింది.
ఆ రోజున ఇల్లు చేరుకునే లోపు గతంలో చూసిన మరికొన్ని ఏకవాక్య కావ్యాలు మదిలో మెదిలాయి. రెండేళ్ళ క్రితం తమ్ముడి గారి అబ్బాయి చంద్రకళతో ఆస్ట్రియాలో సంగీత విద్వాంసుడు మొజార్ట్ నివసించిన సంగీతమయ సాల్స్‌బర్గ్ నగరంలో తిరుగుతున్నప్పుడు, ‘Save Water – Drink Beer’ అన్న బోర్డు పట్టుకుని కూర్చున్నతన్ని చూశాం. ‘బీరు బలులకు బీరు తాగడానికి ఇంతకు మించి ఆనందాన్నిచ్చే ఉత్సాహకరమైన ఏక వాక్య సందేశం ఇంకేముంటుందని ధ్రిల్ అయ్యాము.
ఇరవై ఏళ్ళ క్రితం విశాఖపట్నంలో ఉన్నప్పుడు రుషికొండ బీచ్ దగ్గర ‘‘If you swim you will be the Next” అన్న చిన్నచిన్న బోర్డులు చూశా. సముద్రం లోతు గురించి, ఈతాడదామని సరదాపడితే జరిగే పర్యవసానం గురించి అసంపూర్ణ వాక్యంతో సంపూర్ణమైన అవగాహన కల్పించిన ఇది కూడా రసాత్మక కావ్యమే. గొప్ప గ్రీకు దేశపు శిల్పి మైకిలేంజిలేను ఇంత సజీవమైన శిల్పాలను మీరు ఎలా మలచగలరు అని అడిగితే ఆయన పాలరాతిలో ఆ శిల్పం ముందే దాగి ఉంది. నా పని కేవలం అందులోని శిల్పాన్ని వెలికి తీయడమే అని చెప్పాడట. మైకిలేంజిలే స్ఫూర్తితో Nalsar లా యూనివర్సిటీ వారు లైబ్రరీ గేటు దగ్గర ఒక రాయిని పెట్టి, పై మాటలతో పాటు “There is already a fine Lawyer in you. Help us to chisel it” అని ఒకే ఒక్క వాక్యంలో వారి కృషికి సహకరించమని విద్యార్థులను కోరడం గొప్ప ఆలోచనే.
కొంతమంది రాసింది పది పేజీలు చదివినా ఏమి చెబుతున్నారో అర్థం కాదు. అందుకనే Shakespeare “Brevity is the soul of wit” అని ఏనాడో చెప్పాడు. కొందరు Things Made easy book రాస్తే మరికొందరు Things made Difficult పుస్తకం కూడా రాయగలరు. పులి అంటే తెలయని వాళ్ళకు శార్థూలం అని అర్థం చెప్పేవారన్నమాట. చిన్న మాటల్లో గొప్ప విషయాలు చెప్పగలగడం గొప్ప కళ. దీనికి ఎంతో పరిణిత, మేధకావాలి. కొన్ని దుకాణాల్లో చిన్నప్పుడు చూసిన ‘అప్పురేపు’ అన్న విషయాన్నే మరికొంచెం లౌక్యంతో “No credit unless you are Ninety and accompanied by both the parents” అనే బోర్డులూ చూశాం. ఒక పింగాణీ బొమ్మలు (China ware) అమ్మే షాపులో “If broken treat as sold” అని కష్టమర్స్‌కు తస్మాత్‌జాగ్రత్త చెప్పేవి చూస్తుంటాం. ఇలాంటి చతురత గలిగిన “We Dye for our living” అని రాజమండ్రిలో ఒక రంగులు అద్దే దుకాణంపైన రాసిన అర్థవంతమైన మాటలు నన్నెంతో ఆకర్షించాయి. విరిగిపోయిన పలురకాల వస్తువులను అతికే సరుకును అమ్మే కంపెనీ ….
అనే ad ద్వారా పగిలిన హృదయాలకు మాత్రం మందు లేనేలేదని కూడా చెప్పింది. ఇలాంటివే మరో రెండు కాన్సాస్ యూనివర్సిటీ చూడటానికి అక్కడ మెకానికల్ ఇంజనీరింగులో డాక్టరేట్ చేస్తున్న మన హైదరాబాద్ అబ్బాయి సాయిచరణ్‌తో కలిసి వారి ప్రొఫెసర్ కరణ్ సురానా గారిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ బిల్డింగ్ నోటీస్ బోర్డులో ….
అని రాసి ఉన్న కాగితం కనిపించింది. మన పెద్దలు కూడా ఇదే మాటను ‘అభ్యాసము కూసువిద్య’ అని, ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అని ఏక వాక్యంగానే చెప్పారు.
Grand Canyon కు వెళ్ళేదారిలో ఒక చిన్న షాపు కౌంటర్ దగ్గర …
అని రాసి ఉన్న ప్లేట్ ఉంది. ఇంటి యజమాని తమ అతిథులు ఎక్కడ భద్రంగా ఉంటే మేలో నర్మగర్భంగా హెచ్చరించాడు. మా బాల్యమిత్రుడు లతీఫ్‌తో కలిసి చదువుకునే రోజుల్లో ఒక ఇంటికి వెళ్తే ‘‘కుక్క ఉన్నది జాగ్రత్త’’ అనే బోర్డు చూసి, ‘‘కర్ర ఉన్నది ఫర్వాలేదు’’ అని భరోసా ఇచ్చేశాడు. ఇవన్నీ హోమియో వైద్యంలో సింగిల్‌డోస్ థెరపీ లాంటివి.
ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో అన్ని భాషల్లో ప్రజల జీవితానుభవసారం నుండి పుట్టుకొచ్చిన సామెతలన్నీ ఏకవాక్య కావ్యాలే. అందువల్లనే ప్రపంచ సాహిత్యంలో సామెతలకున్న ప్రాచుర్యం అసమానం. మన తెలుగు సామెతలు మన భాషా, సంస్కృతులను మరింతగా ఇనుమడిరప చేశాయి. సామెతలు లేని సంభాషణలు, రచనలు ఉప్పులేని వంటలే. ప్రాంతాల వారీగా, వివిధ వృత్తుల సంఘర్షణలో నుండి పుట్టిన ఎన్నో సామెతలు వాడకం కరువై కనుమరుగై పోతున్నాయి. వాటన్నింటినీ సేకరించి భావితరాలకు అందించే బాధ్యతనెవరైనా చేపడితే బాగుంటుంది. తెలుగు మాట్లాడే వాళ్ళు తగ్గిపోయి తెలుగు ఇంగ్లీషులా మాటాడే మంచులక్ష్మమ్మలున్న ఈ కాలంలో తెలుగు సామెతలెలా బతికి బట్టకడతాయి. గాయట్రీ మంత్రం నేర్చుకున్న టెల్గమ్మాయిల్లాగానే.
మన భారతీయ తత్త్వ చింతనలో మన ఉపనిషత్తులలోని నాలుగు మహావాక్యాలు ఒక్కొక్క వేదం యొక్క సారమే. అత్యున్నతమే బ్రహ్మమని తెలిపే ప్రజ్ఞానం బ్రహ్మ (ఐతరేయ ఉపనిషత్తు), నేనే బ్రహ్మము అని తెలిపే అహం బ్రహ్మస్మి/ (బృహవారణ్యకోపనిషత్తు), అదేనేను అని చెప్పే తత్త్వమసి (ఛాంద్యోగపనిషత్తు), ఈ ఆత్మే బ్రహ్మము అని చెప్పే అయమాత్మాబ్రహ్మ (మాండూక్యోపనిషత్తు). ఈ నాలుగు వాక్యాలను ఆకళింపు చేసుకోవడానికి ఒక జీవితం చాలదు. కొన్నివేల సంవత్సరాల పూర్వం మన ఋషులు బోధించిన ఈ వాక్యాలపై ఇప్పటి వరకు వచ్చిన, వస్తున్న వ్యాఖ్యానాలను ఉంచడానికి చాలా పెద్ద గ్రంథాలయమే కావాలి.
ఇవన్నీ చూస్తే ‘మాటే మంత్రం’ అనే మన పెద్దల మాట చద్దిమూటే అని తెలియజేసే ఏ వాక్యమైనా రసాత్మకమే, కావ్యమే!
(Nalsar విద్యార్థి ఆశీష్‌కు ఆశీస్సులతో, మిత్రుడు ఓంకార్ రెడ్డికి కృతజ్ఞలతో)
మాటే మంత్రం👌👌
Sir your narration and presentation on simple and very common subjects are very extraordinary and superb and thanks sir
మీ వ్యాసం ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది. ఇటువంటి వాక్యాలు చదువుతున్నప్పుడు మన బాధ్యతని కూడా గుర్తు చేస్తాయి.
ఒక చిన్న వాక్యాన్ని లేదా సంఘటన ను గమనించి మాటలను మంత్రించడం really great.
Nicely illustrated common man emotions!!!
Powerful words after your coming back home ..
We expect many more with your sense of humour…giving flavour to your storey scripts …Basu
హర్ష,
నీలో వున్నఅమోఘమైన ఆలోచనా సరళికి నిజంగా ముగ్దుడిని అయ్యాను. పిల్లలతో భోజనానికి వెళ్ళి అచట వున్న కార్ వద్ద అట్ట ముక్క మీద రాసిన ఒక్క పదం మీద ‘ మాటే మంత్రం ” ఆర్టికల్ ఆద్యంతం అద్భుతం. మాటతో మంచితనం ఎలా వుంటుందో చెప్పకనే చెప్పావు. ఇప్పటికీ నీ నుంచి నేను నేర్చుకుంటూనే వున్నాను. మరో మారు అభినందనలతో నీ మిత్రుడు …… రవీంద్రనాథ్
హర్ష, నీలో వున్నఅమోఘమైన ఆలోచనా సరళికి నిజంగా ముగ్దుడిని అయ్యాను. పిల్లలతో భోజనానికి వెళ్ళి అచట వున్న కార్ వద్ద అట్ట ముక్క మీద రాసిన ఒక్క పదం మీద ‘ మాటే మంత్రం ” ఆర్టికల్ ఆద్యంతం అద్భుతం. మాటతో మంచితనం ఎలా వుంటుందో చెప్పకనే చెప్పావు. ఇప్పటికీ నీ నుంచి నేను నేర్చుకుంటూనే వున్నాను. మరో మారు అభినందనలతో నీ మిత్రుడు …… రవీంద్రనాథ్
Sushamulo Moksham laaga, small placard made you recollect so many old ones and their messages they conveyed is simply awesome. Enjoyed your witty write up thoroughly.
Thanks once again Harshavardan Garu.
అద్భుతః….
ఆహా! ‘మాటే మంత్రం’ నిజంగా మంత్రమే! నర్మగర్భంగా చెప్పగలగడం కళే! మాటకున్న మహత్యాన్ని ఉపనిషత్తుల సాక్షిగా తెయజేసి మా హృదయాలను రంజింపజేసినందుకు కృతజ్ఞతలు మహానుభావా🙏🏼🙏🏼🙏🏼——చలం
Very nice…chala bhagundhi
I have two lines for same kind
May be…if not ignore please
1. No parking please
Ans: now parking please
My own cartoon in my chaildwood 8th standard time.
2.before freedom time infront of few restarents
“Indians and dogs are not allowed”
హర్షవర్ధన్ గారూ!సమయస్ఫూర్తి మీ మాటకు సాయం చేసి ఈ వ్యాసానికి దోహదం చేసింది. పరిశీలన, విశ్లేషణలు మీ పలుకు బడులలో అందంగా ఒదిగిపోతాయి.
అభినందనలు.
కుప్పుస్వామి అయ్యర్ made difficult అనే guide గురించి చెప్పలేదే
అవును ఏక వాక్య కావ్యాలు చాలానే వున్నాయి. అన్నీ ఒక దగ్గర చేర్చావు.
అప్పు లాగే మన వాళ్ళు “ఓ స్త్రీ రేపు రా” అని దయ్యాలను కూడా మోసం చేశారు.
కేసీఆర్ లాటి వాళ్ళు రక రకాల సామెతలు వాడుతుంటారు. ఈ కాలం పిల్లలకు సామెతలు అసలు తెలీదు.
Excellent pariseelana👏👏👏👏👏👍👍👍
Fine sir
“”గాయట్రీ మంత్రం నేర్చుకున్న టెల్గమ్మాయిల్లాగానే.””🤩🤩🤩