ప్రస్తుతం దేశాన్నంతా శాసిస్తున్న మంత్రం ‘శ్వాసే’ కనుక దానిమాటే చెప్పుకుందాం. స్వామి రంగనాథానంద గతంలో ఒక ఉపన్యాసంలో అమెరికాలో జరిగిన సంఘటనొకటి చెప్పారు. అక్కడ రోజూవారీ రొటీన్ పలకరింపుగా ఒకర్ని ‘How are you?’ అని అడిగితే అతను ‘Still breathing’ అని చెప్పాడట. అయితే ఈ సమాధానం చెప్పే సమయంలో ఆ పెద్దాయన టొయోటా కారులో ఎ.సి.వేసుకుని పాటలు వింటూ పోతున్నాడట. ఇది విన్న స్వామిజీ అదే మనదేశంలో అయితే 450 డిగ్రీల ఎండలో, గాలికి చెప్పులు కూడా లేకుండా రిక్షాతొక్కుతున్న బడుగుజీవిని ‘ఎలా ఉన్నావు?’ అని అడిగినా ‘ఏదో బండి గెంటుతున్నాం బాబయ్య, తమ దయవలన బాగానే నడిచి పోతుంది’ అన్నమాటే అంటాడు కాని టొయోటా కారువాలాలా డీలా పడిపోడు అనిచెప్పారు. వీరిద్దరి మధ్య ఎంత తేడానో గమనించండి. నిజమైన కష్టంలోవున్నవాడు ఆ స్పృహే లేకుండా బతికేస్తుంటే ఏ కష్టంలేని వాళ్ళే still breathing అంటుంటారు అని చెబుతూ స్వామీజీ మీ కష్టాలను ఎక్కువ చేసి ఊహించుకోకండి నిజమైన కష్టాలు మీకు తెలియవు అవి వస్తే మీరు భరించలేరు అని చెప్పారు.
నిజమైన కష్టమంటే కరోనా వచ్చిన వాళ్ళను హోమ్ కోరంటైన్ అవ్వమనడం. హోమేలేని లక్షల మందిని హోమ్ కోరంటైన్ అవ్వమనడం Landless poor కు Land ceiling act notice ఇవ్వడం లాంటిదే. మన మహానగరాల్లో కొన్ని వందల అపార్ట్‌మెంట్ సెల్లార్స్‌లో మన బాత్‌రూమ్‌ల కంటే చిన్నఇళ్లల్లో బతుకుతూ పై అంతస్తులను తమ భుజాలపై మోసే వాళ్ళంతా భూమిని మోసే ఆదిశేషుని కంటే గొప్పవాళ్ళు. మనల్ని మోసే వాళ్ళ కష్టంముందు మనం పడే కష్టం ఏపాటిది. అందుకని వాళ్ళ కష్టాల్నీ కాచుకుందాం. వాళ్ళు లేనిదే మనంలేము అనేది తెలుసుకుందాం.
వెనకటికి నరకంలో ఉన్నవాడితో, ‘Go to Hell’అంటే ‘I am already in Hell Sir, Where can I go?’ అన్నాడట. ప్రస్తుతకాలంలో Still breathing అనేది గొప్ప అదృష్టమే. Involuntary act of breathing is becoming difficult despite our Government Volunteering for Oxygen. మనం ఏనాడు ధ్యాసపెట్టనవసరంలేని అనియంత్రణ శ్వాసక్రియ నేడు మన అందరి జీవితాలను నియంత్రిస్తోంది. ఇదంతా చూస్తుంటే Count your Blessings అన్నది ఎంత reassuring గానో అనిపించకమానదు.
చీరకు మ్యాచింగ్ జాకెట్ దొరకడంలేదని మనోవ్యధతో మంచమెక్కేవాళ్లు, చొక్కాకు ఒక్క గుండీ ఊడిపోతే గుండె ఊడిపోయినంత దుఃఖపడేవాళ్లు, మనం రోజూ తాగే కాఫీబ్రాండ్ దొరక్కపోతే, ‘oh shit!’ అనుకునేవాళ్ళంతా ఈ దిగులు కాని దిగుళ్ళను దించేసుకుని ప్రశాంతంగా ఉండటం అలవరచుకోవాలి. ఇవన్నీ అల్పమైన విషయాలు అనుకోవడానికి, పదేపదే
‘I was very much worried for not having another pair of shoes until I saw a man without feet’ అన్న అరబ్బీ సామెతను మననం చేసుకుంటే మనం ఎంత అదృష్టవంతులమో తెలుస్తుంది.
జర్మన్ నాజీ కాన్‌సంట్రేషన్ క్యాంపులో దుర్భర జీవితం గడిపి విముక్తుడైన ప్రముఖ మానసికవేత్త విక్టర్ ఫ్రాంకెల్ ‘ఎన్ని కష్టాలున్నా జీవితం జీవించడానికే అన్న విశ్వాసంతో ఉండాలి’ అని చెప్పిన మాట ఇప్పటి మన పరిస్థితులకు అన్వయించుకుని ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ముందుకు సాగాలి. ప్రఖ్యాత అమెరికన్ ఆర్థికవేత్త J.K.Galbraith, ‘India is a functioning anarchy’ అన్నాడు, అలాగే మరో మహానుభావుడు ‘మనదేశంలో ప్రజలు ప్రమాదవశాత్తూ జీవిస్తున్నారు’(In India People live by accident) అనికూడా అన్నాడు కనుక ప్రభుత్వాలు వాటి పనితీరు మనకు పాతే కాని ప్రమాదాలు కొత్త కాదు. అందుకనే మన కర్మభూమికి ప్రభుత్వాలు ఒకటో, రెండో అయినా దేవతలు మాత్రం ముక్కోటి. మీ ఆత్మవిశ్వాసం జోడించి వారికి మొక్కండి, ఎవరో ఒకరు సాయంపట్టేస్తారు, గండం గట్టెంక్కించేస్తారు. పరిస్థితులెలా ఉన్నా Still breathing అనడానికి ఎంతో మందికి అర్హత లేదు. అలా అనడానికి అర్హత ఉన్న వాళ్లెవ్వరూ అలా అనుకోకపోగా బతుకు పోరాటం కొనసాగిస్తున్నారు.
చివరగా షోలే సినిమాలో గబ్బర్ సింగ్ అన్నట్లు ‘జో డర్‌గయా సమ్‌జో ఓ మర్‌గయా’ అన్నది నిజం. అందుకనే భయం వీడి బాధ్యతతో జాగ్రత్త వహించండి.
Ending is good ,suggesting to live without fear with all this variations.
Everytime I read your article what really impresses me is your keen observations.keep going Harsha garu.
Try writing on AP after division without a capital and progress.
Dilip.c.Byra
చాలా బాగా రాశారు అన్నయ్యా. వర్తమానానికి అనుగుణంగా వుంది.
నా దృష్టి లో ధైర్యం, నమ్మకం,తృప్తి లేని వాడు మృతుడు కిందే లెక్క.ఆత్మ విశ్వాసం జోడించి నలుగురికి సహాయపడాలనే మీ దృక్పథం, సందేశం ప్రస్తుత పరిస్తితులలో చాలా అవసరం. మీ ఈ ప్రయత్నం శ్లాఘనీయం🙏
Chala bagundi sir.. 🙏
లోకాన్ని కాచి వడబోసి కాసిన్ని స్వాంతన వాక్యాలు మాకు అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు
This blog I find is very relevant to the present times. These days all our conversations are centered around this deadly virus and the havoc it is creating. Harsh anna through this blog tells us about being content and be happy with whatever you are having (referring to the first paragraph) and perhaps also warns us about the severe difficulties we may face and be prepared to face them. I have known anna’s empathy towards the poor and this is revealed by telling us to take care of the poor and be empathetic towards them.
All the best anna.
All these seemingly impossible statements are Hard facts. And the facts, these empowering Truths have been hidden in plain sight. Everyone is capable of healing oneself and others. Sea means the disturbed, turbulent emotional state of mind. This state can subside when one tune in with & experience the river of peace and love flowing through one self vitalize whole being. Dividing the waters or separate the chaff from the wheat, the false from the Truth. “GREAT TRUTHS Can Set us FREE”
Tears rolled down while reading the line,”I was very much worried for not having another pair of shoes, till I found a man without feet”
Confidence building article Sir.
👍👍
Sir
Namasthe
Excellent article related to the present scenario
Congratulations Sir
Well written.
Relevant to the present day situation.
చాలా బాగుంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మనుషుల మనస్తత్వాలను ప్రతిబింబించేలా రాశారు. మనిషికి సంతృప్తి ఉండాలి, సంతృప్తి లేని వ్యక్తులు నిత్యం బాధపడుతూనే ఉంటారు. ఆశావహ దృక్పథం అలవర్చుకోవాలి. చాలా మంచి వ్యాసం. ఆలోచనాత్మకంగా ఉంది. ఇంకా మంచి మంచి అంశాలతో మీరు మా ముందుకు రాగలరని ఆకాంక్షిస్తున్నాను. హృదయపూర్వక అభినందనలు.
‘Landless poor కు Land ceiling act notice ఇవ్వడం లాంటిదే.”… Your magical touch…
కేవలం వాస్తవ పరిస్ధితిని సోదాహరణంగ
వివరించటమే కాకుండా, ఈ ఊపిరి అందని పరిస్ధితి నుండి ఎలా గట్టెక్కే ప్రయత్నం చేయవచ్చో సూత్రీకరించటం నిజంగా హర్షణీయం
మీ ఆత్మవిశ్వాసం జోడించి వారికి (దేవతలకు) మొక్కండి అనే వాక్యం ఊపిరి బిగబట్టి చదువుతున్న నాకు ఊపిరి పీల్చుకునేల చేసింది. (కరోన కాదండోయ్) ఈ వాక్యం ఈ వ్యాసానికే “ఊపిరి” అని నా అభిప్రాయం
కొరోనా పై మీ ఈ వ్యాసం ‘హర్ష’ నీయం.
వ్యాసం బాగుంది. ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. ప్రభుత్వాల అసమర్థత, ప్రజల అవివేకం వెరసి ఈ సంక్లిష్ట పరిస్థితి . మైసూరు వాసుదేవ చార్యులవారు అన్నట్టు “బ్రోచేవారెవరురా నిను విన రఘువరా ” అని అనటం తప్ప వేరే దారి లేని పరిస్థితి .
కొన్ని అచ్చుతప్పులను ఎత్తి చూపుతున్నందుకు తప్పుగా అనుకోకపోతే ,
1. Correct the spelling from Involantary to “Involuntary”
2. Involantary act of breathing has becoming difficult: I see a grammar mistake. Become is appropriate here instead of becoming or change “has” to “is”. Not sure which one you intended to write.
3. మనోవ్యధ ని “మనోవ్యథ” గా మార్చండి
It is difficult to type in telugu on qwerty keyboard and so mistakes do happen. I have been guilty on this front multiple times. Moreover, you have to switch between teugu and english often. That makes it even more error-prone. My intention in pointing out is to improve the readability of this essay for others. Hope you appreciate my intention.
నా మటుకు నేను “గృహమేవ శరణం మమ, అన్యథా శరణం నాస్తి ” అన్నట్టుగా ఇంటిపట్టునే ఉంటున్నాను.
లోకా సమస్తా కోరోనా ముక్తిరస్తు !
మొత్తానికి కొరోనా పై మీ ఈ వ్యాసం ‘హర్ష’ నీయం
Thank you for your encouraging words
Sir excellent and the Arabic say is very excellent . We should be satisfy what you have .
చాలా ఉత్తేజ భరితంగా వుంది.గొప్ప స్పూర్తి సందేశం.ఎంతో లోకనుభవం వుంటే కానీ ఈ దృష్టి తో చెప్పలేరు
Very true
Sir,
“చదివాను,చాలా బాగుంది” అని చెప్పడం నాకెందుకో అంత బాగా అనిపించడం లేదు. మరేమని చెప్పాలనుకుంటు న్నానంటే,సరళమైన భాషలో,చదివించే సరళిలో సరిగ్గా ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టినట్టు ఉండటమే కాదు, మనుషులు ఏం చెయ్యాలో కూడా చెప్పేదిగా ఉంది.
బాగుంది హర్ష
Very aptly written and the depth of the situation is clearly depicted in simple words 👌🏻👌🏻👌🏻
Chaalaaa Baagundandi Sir
The article is so touching that it relates to the present situation and it will be written in the history of the future how one and all are facing this current situation….wonderful explanation and apt …
Excellent description of what we consider as great difficulties are in fact very silly and trivial things.
Nicely presented . Really thought provoking
👏👏👏👏👏