ఆజ్‌కల్ అమెరికాలో ఆ మాట కొస్తే ఇండియాలోనూ థ్యాంక్స్ అనే మాట అరిగిపోయిన రికార్డు అయిపోయిందిగానీ అది ఎంతో కృతజ్ఞతాభావంతో నిండుకున్నదే! మతంతో ప్రమేయం లేకుండా ప్రపంచంలో అన్ని మతాల్లో thanks, gratitude అనేవి ఏదో రూపంలో అనుక్షణం ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఎటొచ్చి (వొట్టి మాటతో సరిపెట్టడం మినహా) చిత్తశుద్ధితో వాటిని ఆచరించే అలవాటే మనలో తగ్గిపోతోంది.
ప్రస్తుతం Thanks Giving Day కి అమెరికాలో ఉన్నాం కనుక అమెరికా ముచ్చటే ముందుగా చెప్పుకుందాం. యూరోపియన్ వలసపాలకులు ఈ పండుగని జరుపుకోవడం మొదలుపెట్టడానికి చాలా కాలం ముందు నుండీ నేటివ్ అమెరికన్లు పంటలు చేతికందే కాలంలో మన సంక్రాంతి పండుగలా ఇది జరుపుకునేవారట. ఎన్నో వనరులను ప్రసాదించినందుకు భూమాతకు, ప్రకృతి శక్తులకు కేవలం కృతజ్ఞతలు తెలిపేందుకే వారి Thanks Giving Day.
1620 ప్రాంతంలో May Flower అనే నావలో ఇంగ్లాండ్ నుండి బయలుదేరిన Protestants
‘‘నడిపించు నా నావా, నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప’’
అని పాడుకుంటూ అమెరికాలో Plymouth ప్రాంతానికి చేరుకున్నారట. ఈ నౌకాయానంలో పుట్టిన ఒక పాపకు Pilgrim అని పేరు కూడా పెట్టడంతో వారందరినీ Pilgrims అని పిలవడం మొదలైంది. May flower నౌకలో అరవై ఆరు రోజులు ప్రయాణించి అమెరికా చేరుకునేలోపు కొంతమంది దారిలో మరణించారట. ఇంకొక ఎడాదిలోపు చలి, మంచుకారణంగా అమెరికా కాలనీలో మరొక యాభై మంది చనిపోయారట. ఆ నౌకలో ప్రయాణించిన పనివాడు Howland, Elizabeth లు ఇష్టపడి పెళ్ళిచేసుకుని, కష్టపడి పది మంది పిల్లల్ని కని వారి ద్వారా 88 (వందకు 12 తక్కువగా) మునిమనవళ్ళను పొందారట. ఈ యాత్రలో Howland ఒక రోజున షికారుకు డెక్ పైకొచ్చి పెనుతుఫానులో సముద్రంలో పడిపోయి ఏదో ఆసరా దొరకడంతో మళ్ళీ నావలోకి ఎగబాకాడట. ఆయన పైకి రాకపోతే టైటానిక్ సినిమాలా ట్రాజడీ అయ్యేది. వారిద్దరూ గట్టి పిండాలే కావడంతో బతికేశారు. May Flower లో వచ్చిన వాళ్ళందరూ ఆమ్ ఆద్మీలే అయినా Howland, Elizabeth వారసుల్లో ప్రముఖకవి Emerson, అమెరికా ప్రెసిడెంట్లుగా ఎన్నికైన రూజ్‌వెల్ట్, అమెరికా అధ్యక్షుడు పెద్ద బుష్, 9/ 11 సమయంలో బెంబేలెత్తి, బుష్‌ల చాటున దాగిన చిన్నబుష్ దొరగారు కూడా వీరి వారసులే. మిగిలిన కొందరు యాత్రికుల వారసుల్లో ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు క్లింన్ట్ ఈస్ట్‌వుడ్, మార్లిన్ మన్రో, కేధరీన్ హెబ్బర్న్ కూడా ఉన్నారట. వీరు నేటివ్ అమెరికన్లతో కొంత సంఘర్షించినా కొన్నేళ్ళకు వారి మధ్య సయోధ్య కుదురి ఇరుగుపొరుగు కుటుంబాలతో కలిసి విందారగించి స్నేహభావం, సౌభ్రాతృత్వం పెంపొందించుకోవడానికి అంకురార్పణ జరిగింది. కాలక్రమేణా Thanks Giving విందు రాజకీయ, దౌత్య వ్యవహారాలకు, పరస్పర శాంతిమయ సహజీవనానికి వేదికగా అవతరించింది.
ఇప్పటి Thanks Giving Day విందులో ప్రముఖంగా కనిపించే టర్కీ కోడి మొదటి థ్యాంక్స్‌గివింగ్ విందులోలేదు. అప్పటికి కేవలం నాటుకోడే ఉందట. (మన RRR Oscar పాట నాటు నాటే నండి), Potatoes, squash, corn, cranberries మాత్రమే విందులో ఉన్నాయట. వాస్తవానికి ఇప్పటి Thanks Giving Day Feast లోకి చేరుకున్న Turkey, potatoes రెండూ అమెరికావి కావు. (ఆ మాటకొస్తే అమెరికాలో ఏవీ అమెరికావి కావు, చివరికి జనాల్తో సహా) Turkey మెక్సికో నుండి, Potatoes South America నుండి వలస వచ్చాయి. ఈ వలస టర్కీకి ప్రాణాంతకమవడం వాటి bad time. ప్రతి ఏటా Thanks Giving Day రోజున 46 లక్షల మిలియన్ల టర్కీ కోళ్ళు గల్లంతు అవుతాయట. పోతన చిన్నికృష్ణుని నోట బాపురే చూపితివట నీ నోట పదునాలుగు భువనాభాండములని అంటే అమెరికాలో Thanks Giving Day రోజు రాత్రి ఎవరు నోరు తెరిచినా మనం చూసితి టర్కీని అని అనవసలిందే! ఈ విషయంలో మనమూ ఏమీ తక్కువ తినలేదు లెండి, మన కార్తీక మాసదీక్షానంతరం చాలా కోళ్ల ఫారాలు ఖాళీ అయిపోవడం, బక్రీద్ తరువాత లక్షల బకరాలు గాయబ్ అయిపోవడం, అయ్యప్పదీక్షల తరువాత మందు కరువవడం మన వాళ్ళ ప్రతిభే!
1947 నుండి థ్యాంక్స్‌గివింగ్ రోజున అమెరికా అధ్యక్షుడికి మూడు టర్కీకోళ్ళను బహుకరించే ఆనవాయితీ మొదలైంది. అధ్యక్షులు వారు ఎంతో కరుణతో ఆ మూడింటిలో ఒక్క టర్కీకి Pardon (మిగిలిన రెండు టర్కీలు చేసిన నేరమేమిటో!) ప్రసాదించి వైట్‌హౌస్‌లో బతికేయమని వదిలేస్తారు. మిగిలిన రెండు టర్కీలు అయ్యవారి డిన్నర్ టేబుల్ మీదకే! మరింత దయాళుడైన ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాత్రం మూడింటికీ ప్రాణ బిక్ష పెట్టేవాడని వినికిడి. ఇదంతా వింటే షోలే సినిమాలో గబ్బర్‌సింగ్ ‘‘బచ్‌గయా సాలా!’’ సీన్ గుర్తొకొచ్చింది.
Thanks Giving Day ప్రతియేటా జరుపుకోవాలని అమెరికా సెనెట్ ఉభయసభల కాంగ్రెస్ తీర్మానించడంతో ప్రతియేటా జరుపుకునే ఆనవాయితీ వచ్చింది. కాకపోతే వేరు వేరు తేదీలలో జరుపుకోవడంతో NRI Grandmas అమెరికాలో రోజూ పాడుకునే Mary had a little lamb అనే పాటను రాసిన Sarah Joespha Hale అనే రచయిత ప్రతియేటా Thanks Giving Day అమెరికా అంతటా ఒకేరోజు జరుపుకోవాలని ముప్పై ఏళ్ళు ప్రభుత్వానికి విన్నపాలు చేసిందట. టర్కీ కోడితో పలురకాల వంటకాలు చేసి మరీ టర్కీలకు ఎసరుపెట్టి వాటిని ప్రముఖ వంటకంగా చేర్చిందట. అబ్రహమ్ లింకన్ 1863లో ఆమె కోరిక మేరకు ప్రతి ఏడాది నవంబర్ నెలలో చివరి గురువారాన్ని అమెరికా అంతటా Thanks Giving Day జరుపుకోవాలని ఆదేశాన్నిచ్చాడట. Josepha జ్ఞాపకార్థం ఆమెను Mother of Thanks Giving Day అని కూడా పిలుస్తారు. అమెరికా బానిసత్వ అంతర్యుద్ధం అంతమై శాంతి నెలకొన్న సందర్భం కూడా ఈ పండుగకు కారణం.
1700 నాటికి Thanks Giving Day విందులో డెస్సర్ట్ కూడా వచ్చి చేరింది. Apple pie, Pumpkin pie, ఏది ఉండాలో tie పడి చివరకు Pumpkin pie గెలిచి నిలబడింది. ఆ తరువాత కాలంలో Football match కూడా Thanks Giving Day సాయంకాలం కార్యక్రమాల్లో జతపడిరది. ఆ రోజు టర్కీ కోడి విందారగించిన జనం మందకొడిగా మారడానికి ఆ కోడిలో ఉన్నacid tryptophan కారణం అనే అపోహ చాలా కాలం ఉండేది. సుష్టుగా భోజనం చేయడంతో మెదడు మందగించి భుక్తాయాసంతో అనకొండలా సోఫాలో పడి కునుక తీస్తూ మంద్రంగా ఫుట్‌బాల్ మ్యాచ్ చూడ్డానికి కారణం Post prandial fatigue అని మన వైద్యులు తేల్చడంతో ప్రాణాలు పోయినా, టర్కీపై నీలాపనింద తొలిగింది.
Thanks Giving Day అయిపోవడం anti-climax మాత్రమే. అసలు కథ తరువాతే మొదలవుతుంది. మన ఊళ్ళో ఏ గొడవ జరిగినా ముందుగా పగిలేది RTC బస్ అద్దాలే! ఇక్కడ ఏ పండగైనా చిల్లుపడేది మన జేబులకే. Thanks Giving Day మరుసటి రోజు Black Friday Sales. అమెరికాలో Independence Day, Labour Day, Valentine Day, Veterans Day, Christmas, Halloween, New Year అని ఎప్పుడూ మాల్స్‌లో Prices slashed up to 40% బోర్డ్‌లు నడుస్తూనే ఉంటాయి. మన దగ్గర Co-optex, Ap-co, Handloom House వాళ్ళు గోడమీద 20% డిస్కౌంట్ అని పర్మినెంట్ గా పెయిన్ట్ వేసేసి దాని కింద ఆషాడ మాసం, దసరా, రంజాన్, దీపావళి, సంక్రాంతి అని మార్చి మార్చి రాసినట్టే. మన ఆవు వ్యాసంలా ఎటు తిరిగొచ్చినా మూడేది మాత్రం మన పర్సుకే. అందుకే లాంగ్ వీకెన్డ్ అని గురువారం నుండి ఆదివారం వరకూ పల్సు వీకయ్యే వరకు పర్సు సంగ్రహణ పర్వం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎవరైనా ప్రవరాఖ్యునిలా కొంత నిగ్రహించినా కొసమెరుపుగా Cyber Monday On Line Sale తో ముక్తాయించి అరకొరగా ఉన్నా మన పర్సు పూర్తిగా ఖాళీ చేస్తారు. (మన మాల్స్‌లో బిల్లింగ్ కౌంటర్ల దగ్గర చాక్లెట్లు, బబుల్‌గమ్స్ పిల్లలకు బాగా కనపడేట్లు పెట్టి అవి కొనే వరకు పిల్లలు మనల్ని యాగీ చేసి, గిరికీలు కొట్టించి కొనిపించేందుకు) ఈ తతంగం అంతా మనకు తెలిసే జరుగుతున్నట్లు భ్రమింపచేస్తూ మనకు తెలియకుండా Non-invasive పథకం ప్రకారం కథ నడిపించడమే అమెరికా మార్కెటింగ్ మాయాజాలం.
మన దేశ సంస్కృతిలోకీ వీటి జాడ్యం చేరుకుంటోంది. మన Valentine’s Day రోజున భజరంగ్‌దళ కార్యకర్తలు ఒక జేబులో రాఖీలతో, ఇంకో జేబులో తాళి బొట్లతో పార్కు పొదల్లోని యువజంటలను వెంటాడి రాఖీ/ తాళి బొట్టు ఏదో ఒకటి బలవంతంగా కట్టించేస్తున్నారు.
Black Friday వెలుగులోకి రావడం వెనుక రెండు కథనాలు వినిపిస్తాయి. గతంలో ఫిలడెల్ఫియాలో Thanks Giving కోసం ప్రక్క ఊళ్ళ నుండి వచ్చిన జనాల్లో కొందరు పోకిరీలు షాపు లిఫ్టింగ్స్, ఈవ్‌టీజింగ్స్ లాంటి ఆకతాయి పనులు చేయడంతో వాళ్ళను అదుపు చేయడానికి పోలీసులు అదనపు డ్యూటీలు చేస్తూ ట్రాఫిక్‌జామ్స్‌తో విసిగిపోయి మరుసటి రోజును Black Friday అనేవారట. మన హైదరాబాద్‌లో ఒకోసారి గణేష్ నిమజ్జనం, రంజాన్ ప్రార్థనలు, బతుకమ్మ పండుగ మూకుమ్మడిగా వచ్చినప్పుడు మన పోలీసు బ్రదర్స్ back to back బందోబస్తులు చేయలేక back pain తో అల్లాడుతున్నట్లే. అన్ని ఊరిగింపులు ప్రశాంతంగా ముగిసిన తరువాతే వాళ్ళు పూర్తిగా ఊపిరి పీల్చుకోవడం.
మరో కథనంలో మన హర్షద్ మెహతా ఫస్ట్ కజిన్స్ Jay Gould, Jim Tisk లు 1869 లో స్టాక్‌మార్కెట్లో ఉన్న బంగారాన్నంతా రాత్రికి రాత్రే కొనేయడంతో షేర్‌మార్కెట్ కుప్పకూలి మదుపరులు తీవ్రంగా నష్టపోవడంతో విషాదాన్ని మిగిల్చిన ఆ రోజును Black Friday అన్నారట. ఆ తరువాత వాళ్ళిద్దరినీ అమెరికా ప్రభుత్వం కటకటాల రుద్రయ్యలను చేసి గండం గట్టెక్కిచ్చిందట. సందట్లో సడేమియాగా Black Friday కి ఉన్న అపప్రధను పోగొట్టే బహానాతో వ్యాపారస్టులు దాని పేరు Big Friday గా ‘మార్ఫు’ చేసి డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు కుమ్మరించి సొమ్ము చేసుకుంటున్నారు. Black Friday రోజున అమెరికా మాల్స్ దగ్గర జనసందోహం కుమ్ములాట ముందు అన్నీ బలాదూరే. అందుకే ఆ కోలాటాల తోపులాటలు మీద బోలెడు జోకులు పడుతుంటాయి. ఆ రోజున కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి. Black Friday Sales రోజున మన మెగాస్టార్ సినిమా ఫస్ట్ డే బుకింగ్ కౌంటర్ దగ్గర వున్న గుంపు కూడా వెలవెల పోవాల్సిందే.
Not shop till you Drop Black Friday Sales – Disclaimer
Drop before you shop
ఈ పండుగల వెనుక కొన్ని అపశ్రుతులున్నా చాలా మంచి సంగతులూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కుటుంబాలన్నీ ఏడాదికోసారి కలుసుకోవడం, ఆత్మీయతలు పంచుకోవడం ఈ స్పీడ్ యుగంలో చిన్న స్పీడ్ బ్రేకరే! మేమూ మార్గదర్శిలో చేరాం అన్నట్లు ఈ సంవత్సరం కాన్సస్‌లో మా అబ్బాయి ఇంట్లో థాంక్స్ గివింగ్ కు గుమికూడాం.
చివరగా Thanks, Gratitude గుణాలు feel good భావనను పెంపొందించి స్నేహబంధాలను బలపరుస్తాయి. బౌద్ధమతంలో రోజూ ప్రొద్దున లేవగానే చేసే Thanks Giving Prayer లో నిద్రలేవగలిగినందుకు ప్రకృతి శక్తులకు కృతజ్ఞతలు చెప్పడం, అందరి హితవు కోరుకోవడం ప్రధానాంశాలు. మన వేద సంస్కృతిలోని ప్రార్థనల్లో కూడా ఇవే చోటుచేసుకున్నాయి. చివరిగా ఎంతో ఓర్పుతో ఇదంతా చదివినందుకు మిత్రులందరికీ మనస్ఫూర్తిగా Thanks తో
(Air Hostess యాత్రికులందరికి చెప్పే చప్పటి థ్యాంక్స్ లా కాదు సుమా..) ముగిస్తున్నా.
(Special Thanks to my son Sandeep for encouraging me to write this post)
Informative and interesting.
‘అన్న దాత సుఖీభవ’ ఈ కోవలోకి చెందినదే కదండీ.
హాస్యరస గుళికలతో సమ్మిళితమై అమెరికా లో నవంబర్ నాల్గొ గురువారం (మీ వల్ల తెలిసింది)ధన్యవాదములు తెలియ జేసుకునే రోజు చారిత్రాత్మక సాంప్రదాయం గురించి దాని విశిష్టత గురించి మీ కే స్వంత మైన మీదైన శైలి లో సవివరంగా తెలిపిన మీకు ధన్యవాదములు 🙏
ఏది రాసిన దాంట్లో ఎంతో నాలెడ్జి ఉంటుంది హాస్యరసతరంగాలు తగులుతూనే ఉంటాయి హాయిగా మనసుకు. కట్టిపడేసే చారిత్రక కథనాల నేపథ్యం ఈ సమాజపు కొత్త పోకడల వ్యాపార ధోరణి పై హాస్యపు చెణుకులు సుతిమెత్తని విమర్శ, మీ రచనల్లో సహజ సుగుణాలు. నమస్కారం సార్.
ప్రతి జీవి తరతరాలుగా తమ తమ సమూహంతో గుమిగూడి కాలక్షేపం చెయ్యడానికే ఏదో ఒక బహానా వెతుకుతుంది
దాని పర్యవసానమే క్రుతజ్ఞతా దినోత్సవం పుట్టి కాలాను గుణంగా మారి మనందరిని రకరకాలు గా తరింప చేయించు కుంటోది
ఈ విషయాన్ని చాలా సరసం గా వివరించి నందుకు ధాంక్యూ 💐🙏🏻
Any events/festivities that created in the past are to improve better human relations & happiness.
The way this is connected from Hindu, Buddha & present contexts is very interesting.
Enjoyed while reading the blog.
హ్యుమర్ తో పాటు Knowledge.. Excellent హర్షగారు.. చాలా బాగుంది..👏👏👌💐💕
Thanks giving కి ఇంత చరిత్ర ఉందా?ఏదైనా పని నెరవేరినప్పుడే మొక్కుబడిగా చెప్పడం అలవాటు, అంతేగాని ఇంత ఆరాటం ఆర్భాటం ఉంటుందని తెలియదు. అయోళ
నా మీరు మషాలాలు కలుపుతారు కాబట్టి బాగుందిలెండి.
అభినందనలు.
-అరిపిరాల.
One thing we have to learn..we take everyone everything for granted..esp family membrrs..as if all family is there to serve us..one should be thankful for even small helps, care and concerns shown to us and reciprocate the same..
Thanks Sir for making us think on the concept of Thanks giving…
Thank you for providing great details of the fourth Thursday of November. Informative and funny. Kadhanam kadam tokkindi. In one word, EXCELLENT. Forced to eagerly run to the next sentence every time 👏👏👏
Very nice Harshavardhan garu…you prooved you can deal any subject…..